ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పోర్టికోలో కుర్చీల తొలగింపుపై రగడ

ABN, Publish Date - Jul 01 , 2025 | 12:08 AM

బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయం ప్రాంగణంలో పోర్టికో లో ఏర్పాటు చేసిన కుర్చీలు, టేబుల్‌ను తొల గించడంపై వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్‌ సమావే శంలో రగడ చేశారు.

సమావేశంలో కౌన్సిలర్ల వాగ్వాదం

బొబ్బిలి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయం ప్రాంగణంలో పోర్టికో లో ఏర్పాటు చేసిన కుర్చీలు, టేబుల్‌ను తొల గించడంపై వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్‌ సమావే శంలో రగడ చేశారు. సోమవారం బొబ్బిలి మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. అజెండా లోని అంశాలన్నిటినీ చర్చించి ఆమోదించారు. వైసీపీ కౌన్సిలరు ఇంటి గోవిందరావు తొలుత ఈ కుర్చీల అంశాన్ని లేవనెత్తారు. పోర్టికోలో ఉండే కుర్చీలు, టేబుళ్లను ఎందుకు తొలగిం చారని ప్రశ్నించారు. ఆయనకు సీనియర్‌ కౌన్సిలర్లు కోట పెదరాములు, చోడిగంజి రమేష్‌నాయుడు, సవలాపురపు రామకృష్ణ తదితరులు మద్దతు తెలిపారు. దీనిపై చైర్మన్‌ మాట్లాడుతూ పోర్టికోలో ప్రజలెవరూ కూర్చోవడం లేదు.. అదే పనిగా కొంతమంది రాత్రివేళల్లో కూర్చుంటూ మద్యం తాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. అందుకే కుర్చీల స్థానాలను మార్చామని సమాధానం ఇచ్చారు. కౌన్సిలర్లందరికీ పై అంతస్తులో చైర్మన్‌ చాంబర్‌ ముందు ప్రత్యేకంగా ఏసీ రూంను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ చాంబర్‌లో హంగులు కల్పించేందుకు రూ.5లక్షలు ఖర్చు చేశారని, దీనిని ప్రారంభించేటప్పుడు తమను ఆహ్వానించలేదని చోడిగంజి, ఇంటి విమర్శించారు. ఇది తమ ప్రివిలైజ్‌ అని, చట్టవిరుద్ధమైతే కోర్టుకు వెళ్లవచ్చని చైర్మన్‌ బదులిచ్చారు.

తాగునీటి సమస్యను పరిష్కరించండి

పట్టణంలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని, వాటర్‌ వర్క్స్‌ సిబ్బంది తమ ఫోన్లకు స్పందించడం లేదని వైస్‌చైర్మన్‌ చెలికాని మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరికొంతమంది కౌన్సిలర్లతో పాటు చైర్మన్‌ కూడా ఆరోపించారు. మున్సిపల్‌ డీఈఈ కోరెడ్ల కిరణ్‌కుమార్‌, ఏఈ గుప్త వివరణ ఇచ్చారు. పబ్లిక్‌ టాయలెట్స్‌, పారిశుధ్య నిర్వహణ తదితర వాటిపై చోడిగంజితో పాటు పలువురు కౌన్సిలర్లు సూచనలు చేశారు. ఈ సమావేశం లో కమిషనర్‌ లాలం రామలక్ష్మి, ఆర్వో నాగరాజు, ఆర్‌ఐ సురేష్‌బాబు, శానిటరీ ఇన్‌స్పెక్టరు మురళి, టౌన్‌ప్లానింగ్‌, మెప్మా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 12:08 AM