Review of Arrangements for Shyamalaamba Festival శ్యామలాంబ పండగ ఏర్పాట్లు పరిశీలన
ABN, Publish Date - Apr 30 , 2025 | 11:55 PM
Review of Arrangements for Shyamalaamba Festival సాలూరు గ్రామదేవత శ్యామలంబ పండగ ఏర్పాట్లను ఎస్పీ మాధవరెడ్డి బుధవారం పరిశీలించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అల్లువారి వీధిలో సిద్ధమవుతున్న సిరిమాను, అంజలి రఽథాన్ని పరిశీలించారు.
సాలూరు, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): సాలూరు గ్రామదేవత శ్యామలంబ పండగ ఏర్పాట్లను ఎస్పీ మాధవరెడ్డి బుధవారం పరిశీలించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అల్లువారి వీధిలో సిద్ధమవుతున్న సిరిమాను, అంజలి రఽథాన్ని పరిశీలించారు. జన్నివీధి, పెద్దకోమటిపేటలో ఉన్న అమ్మవారి గద్దెలను దర్శించారు. పండగ విజయవంతం చేయాలని , పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. డీఎస్పీ ఎం.రాంబాబు మాట్లాడుతూ.. జీగిరాం నుంచి వచ్చే వాహనాలు కేవీఆర్ ఎస్టేట్‌లో ఉంచాలని, కొట్టక్కి నుంచి వచ్చేవి ముత్యాలమ్మ ఆలయం సమీపంలో ఉంచాలని తెలిపారు. నెలిపర్తి, మోసూరు, పాంచాలి నుంచి వచ్చే వాహనాలు బంటి స్టేడియంలో పార్కింగ్ చేయాలని సూచించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ ఉంటుందన్నారు. డీజేలకు అనుమతి లేదన్నారు. ఆశ్లీల నృత్యాలు పూర్తిగా నిషేధమని తెలిపారు. సిరిమాను తిరిగేచోట పార్కింగ్ ఉండదని వెల్లడించారు. భక్తుల దర్శనార్థం కూడళ్లలో ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేయనున్నామన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 11:55 PM