ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రీసర్వే వినతులు పరిష్కరించాలి

ABN, Publish Date - May 23 , 2025 | 12:18 AM

: రెవెన్యూ రీసర్వే వినతులన్నీ వారంరోజుల్లో పరిష్కారం కావాలని జాయింట్‌కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌ ఆదేశించారు. అర్జీల డిస్పోజ్‌ చేయడం ముఖ్యంకాదని, పరిష్కారం కావా లని స్పష్టంచేశారు.

మాట్లాడుతున్నసేతు మాధవన్‌ :

బొబ్బిలి/రూరల్‌, మే 22(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ రీసర్వే వినతులన్నీ వారంరోజుల్లో పరిష్కారం కావాలని జాయింట్‌కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌ ఆదేశించారు. అర్జీల డిస్పోజ్‌ చేయడం ముఖ్యంకాదని, పరిష్కారం కావా లని స్పష్టంచేశారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చే వినతుల్లో 90 శాతం వరకు రెవెన్యూకు సంబంధించినవే వస్తున్నాయని తెలిపారు. గురు వారం బొబ్బిలిలో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాల రెవెన్యూ అధికారులతో జేసీ మాధవన్‌ ఇళ్ల స్థలాల క్రమబద్థీకరణ, అంద రికీ గృహాలు, ఇళ్ల స్థలాల రీవెరిఫికేషన్‌, వాటర్‌ టాక్స్‌, ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ పెండింగ్‌, రీసర్వే, పీజీఆర్‌ఎస్‌ వినతులపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలాల క్రమబద్ధీకరణ కోసం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఆక్రమణదారులతో దరఖాస్తులు పెట్టించాలని, అందుకోసం వీఆర్వోలు క్షేత్రస్థాయిలో ఇం టింటికి సందర్శించాలని తెలిపారు. రెండు రోజుల గడువులో అన్నిగ్రామాల్లో పర్యటించి ఆక్రమిత భూముల వివరాలను నమోదు చేయాలని సూచించారు. వచ్చే సోమవారం నుంచి ఈ విషయంపై వినతులు అందితే సంబంధిత వీఆర్వోపై చర్యలు తీసుకుంటా మన్నారు. అందరికీ ఇళ్లు పథకం కింద జిల్లాలో ఆరు వేల దరఖాస్తులు అందాయ ని, వీటిని వెరిఫై చేసి శనివారం నాటికి ఆన్‌లైన్‌ చేయాలని తెలిపారు. రీసర్వేలో జరిగిన తప్పిదాలను సవరించాలని, వెబ్‌లాండ్‌లో ఒకరి పేరుంటే పొజిషన్‌లో ఇంకొకరి పేరు ఉందన్నారు. డాక్యుమెం ట్‌లను వెరిఫై చేయకుండా తప్పులుగా నమోదు చేశా రని ఆగ్రహంవ్యక్తంచేశారు. రీసర్వేపై వచ్చిన వినతు లను మండలాల వారీగా జాబితా ఇవ్వనున్నట్లు తెలి పారు. వాటర్‌ టాక్స్‌ జిల్లాలో సుమారుగా 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేయవలసి ఉండగా కేవలం 53 వేల రూపాయలను మాత్రమే వసూలు చేశారని, ఇకపై వారం వారం లక్ష్యాలను నిర్దేశిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో జీవీఎస్‌ రామ్మోహ నరావు, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ రమణమూర్తి, నియోజకవర్గానికి చెందిన తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు, డీటీలు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 12:18 AM