Re-survey Errors రీ సర్వే తప్పులు.. పథకాలకు దూరం
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:37 PM
Re-survey Errors Keep Beneficiaries Away from Schemes గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే రైతులకు శాపంగా మారింది. మరికొంతమంది పేదలను సంక్షేమ పథకాలను దూరం చేసింది.
సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్‌లో వినతుల వెల్లువ
పార్వతీపురం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే రైతులకు శాపంగా మారింది. మరికొంతమంది పేదలను సంక్షేమ పథకాలను దూరం చేసింది. గతంలో పాస్‌పుస్తకాలు కూడా చూడకుండా రీ సర్వే చేపట్టారు. తప్పులు తడకలగా రికార్డులు నమోదు చేశారు. భూమి ఉన్నవారికి లేనట్టు.. లేని వారికి ఉన్నట్టు.. మరికొందరికి అధికంగా భూములున్నట్లు చూపారు. అయితే వాటిని సరిచేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినప్పటికీ గత వైసీపీ నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. తాజాగా సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో అత్యధికులు భూ సమస్యలపైనే అర్జీలు ఇచ్చారు. తనకున్న భూమికి అదనంగా మరికొంత జోడిస్తూ.. రికార్డులో అధికంగా నమోదు చేయడంతో ప్రభుత్వ పథకాలకు దూరమయ్యామని గరుగుబిల్లి మండలం కొత్తూరు రెవెన్యూ పరిధిలో ఉన్న బర్ల రాంబాబు తెలిపారు. తనకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవకు వినతిపత్రం అందించారు. అధికంగా భూమి ఉందని రికార్డుల్లో చూపించడం వల్ల తన మనవడు కార్తీక్‌కు ‘తల్లికి వందనం’ వర్తించలేదని సీతంపేట మండలం వెలగపురం గ్రామానికి చెందిన కొండగొర్రె జడ్డెయ్య వాపోయాడు. ఇలా ఎంతోమంది అధికారులకు వినతిపత్రాలు అందించారు. గతంలో చేపట్టిన రీ సర్వేలో జరిగిన తప్పిదాలను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - Jun 30 , 2025 | 11:37 PM