Bridge పూర్ణపాడు-లాబేసు వంతెనకు మోక్షం
ABN, Publish Date - Jun 18 , 2025 | 11:25 PM
Relief for Poornapadu-Labesu Bridge కొమరాడ మండలంలో పూర్ణపాడు-లాబేసు వంతెనకు మోక్షం కలిగింది. దీని పెండింగ్ పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5.25 కోట్లు మంజూరు చేసినట్లు విప్ తోయక జగదీశ్వరి తెలిపారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచినట్లు చెప్పారు.
రూ.5.25 కోట్లు మంజూరు
వెల్లడించిన విప్ జగదీశ్వరి
కురుపాం, జూన్18(ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలంలో పూర్ణపాడు-లాబేసు వంతెనకు మోక్షం కలిగింది. దీని పెండింగ్ పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5.25 కోట్లు మంజూరు చేసినట్లు విప్ తోయక జగదీశ్వరి తెలిపారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచినట్లు చెప్పారు. కురుపాంలో బుధవారం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ.. ‘గత వైసీపీ ప్రభుత్వం పూర్ణపాడు-లాబేసు వంతెనపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం సుమారు 80 పనులు చేయగా.. వైసీపీ సర్కారు కనీసం 20 శాతం పనులు కూడా పూర్తిచేయించలేకపోయింది. దీంతో ఎంతోమంది గ్రామస్థులు ఏటా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచారు. టెండర్లు ఖరారు అయిన వెంటనే పనులు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి అప్రోచ్ రోడ్లు కోసం రూ.కోటి 80 లక్షలతో ప్రతి పాదనలు పంపించాం. ఏడాది కాలంలో ప్రభుత్వం నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ రహదారుల బాగుకు సుమారు రూ. 13 కోట్లు వెచ్చించింది. ఏనుగుల జోన్ ఏర్పాటుతో పాటు జిల్లాకు రెండు కుంకిలను కేటాయించారు.’ అని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కొండయ్య, చిరంజీవి, వెంకటనాయుడు, రాంబాబు, పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 18 , 2025 | 11:25 PM