బహిరంగ చర్చకు సిద్ధమా?
ABN, Publish Date - May 21 , 2025 | 12:11 AM
తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా.. అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.. మాజీ ఎమ్మెల్యే జోగారావుకు సవాల్ విసిరారు.
బెలగాం, మే 20 (ఆంధ్రజ్యోతి): తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా.. అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.. మాజీ ఎమ్మెల్యే జోగారావుకు సవాల్ విసిరారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వ హించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ ప్ర భుత్వ పాలనలో దోచుకోవడం, దాచుకోవడమే ధ్యేయంగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పని చేశారన్నారు. అవినీతి అనకొండ అయిన జోగా రావు తనపై తప్పుడు ప్రచారాలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించిన ట్లేనని ఎద్దేవా చేశారు. బదిలీలలో వసూళ్లకు పాల్పడుతున్నానని తప్పుడు ఆరోపణలు చేసిన ఆయన నిరూపించాలన్నారు. ఆయన చేసిన అక్రమాల చిట్టా తన దగ్గర ఉందని వాటిని మీడియా ముందు పెడుతున్నానని, దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. మీడియా సాక్షిగా బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 2014లో రూ.30 లక్షలు, 2019లో రూ.2 కోట్లు, 2024లో రూ.6 కోట్లు అని అఫడివిట్ సమర్పించారని, కానీ ఆయన పేరున రూ.150 కోట్ల మార్కెట్ వాల్యూతో దస్తావేజులు ఉన్నాయని వెల్లడించారు. వాటికి సంబంధించిన కాగితాలు మీడియాకు చూపించారు. తాను మూడు నెలలుగా తహసీల్దార్‌పై రెవె న్యూ ట్యాంపరింగ్ చేయాలని ఒత్తిడి తెచ్చినట్టు మాజీ ఎమ్మెల్యే ఆరోపిం చారని, అది అవాస్తవమని, ఫేక్ పట్టాలు సృష్టించడంలో ఆయనకు మించినవారు లేరన్నారు. నిరాధార ఆరోపణలు మానుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొట్టాపు వెంకట నాయుడు, బోను చంటి, రౌతు వేణు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Updated Date - May 21 , 2025 | 12:11 AM