ఖాళీ బిందెలతో నిరసన
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:01 AM
మండల కేంద్రంలో 15 రోజులుగా తాగునీరు లేక దళితులు ఇబ్బంది పడుతున్నారని సీపీఎం నాయకుడు కె.సాంబమూర్తి అన్నారు.
ఖాళీ బిందెలతో నిరసన చేస్తున్న దృశ్యం
కొమరాడ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో 15 రోజులుగా తాగునీరు లేక దళితులు ఇబ్బంది పడుతున్నారని సీపీఎం నాయకుడు కె.సాంబమూర్తి అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మోటారు పాడవ్వడంతో నీరు రావడం లేదని, నాగావళి నది నుంచి కలుషిత నీరు తీసుకొచ్చి వినియోగిస్తున్నా మని మహిళలు తెలిపారు. అధికారులకు చెప్పినా పట్టించుకోలేద న్నారు. తక్షణమే మోటారు బాగు చేసి, కుళాయి ద్వారా తాగునీరు వచ్చేలా చూడాలని కోరారు.
Updated Date - Apr 17 , 2025 | 12:01 AM