పచ్చదనాన్ని పెంపొందించాలి
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:13 AM
Promote Greenery జిల్లాలో పచ్చనం పెంపే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈనెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సామూహికంగా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. అటవీ శాఖ మొక్కలు పంపిణీ చేయాలని, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఉద్యాన, జనవనరుల శాఖలు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు.
పార్వతీపురం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పచ్చనం పెంపే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈనెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సామూహికంగా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. అటవీ శాఖ మొక్కలు పంపిణీ చేయాలని, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఉద్యాన, జనవనరుల శాఖలు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 5 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మన్యంలో ఇప్పటివరకు 38శాతం పచ్చదనం ఉందని, దానిని 50 శాతం పెంచాలని సూచించారు. కలెక్టరేట్‌లో ఈ నెల 18న జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా రెడ్ క్రాస్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని, సభ్యులంతా హాజరవ్వాలని కోరారు.
Updated Date - Jun 04 , 2025 | 12:13 AM