గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యం
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:09 AM
గిరిజనుల సంక్షేమా నికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
మంత్రి సంధ్యారాణి
సామాజిక పింఛన్ల పంపిణీ
సాలూరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): గిరిజనుల సంక్షేమా నికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పాచిపెంట మండలంలోని పెద్దవలస పంచాయతీ తెట్టెడివలస, అమ్మవలస గ్రామాల్లో మంగళవారం ఆమె సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా గ్రామానికి వచ్చిన ఆమెకు సాదర స్వాగతం లభించింది. గిరిజనులతో ఆమె థింసా నృత్యం చేసి, డప్పు వాయించి ఉత్సాహం నింపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దవలస, పద్మాపురం పంచాయతీలకు ఏది అవసర మైనా నేరుగా తనను సంప్రదించవచ్చునని చెప్పారు. ఇప్పటికే పాచిపెంట మండలంలో రూ.20 కోట్ల లింకు రోడ్ల మంజూరుకు నిధులు మంజూరు చేశామని ఆమె తెలిపారు. అలాగే తెట్టెడివలస గ్రామంలోని పాఠశాలకు ఇప్పటికే ప్రహరీ మంజూరు చేశామన్నారు. త్వరలో మరుగుదొడ్ల భవనాన్ని, మధ్యాహ్న భోజన వంట గది నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. మండ లంలో ఉన్న పలువురు గిరిజనులకు పోడు పట్టాలను మంజూరు చేస్తామని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ ముఖీ సూర్యనారాయణ, పాచిపెంట మండల ప్రధాన కార్యదర్శి గూడెపు యుగంధర్, సర్పంచ్ కుమారి పాల్గొన్నారు.
రాష్ట్రాభివృద్ధే ధ్యేయం: ప్రభుత్వ విప్
గుమ్మలక్ష్మీపురం: కొత్తవలసలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మంగళవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. టీడీపీ మండల అధ్యక్షు డు అడ్డాకుల నరేష్, ఏఎంసీ చైర్‌పర్సన్ కడ్రక కళావతి, ఎంపీడీవో త్రివిక్రమరావు, తహసీల్దార్ శేఖర్, మాజీ ఎంపీపీ తాడంగి లక్ష్మణరావు, కొత్తవలస మాజీ సర్పంచ్ కృష్ణారావు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధికి కలిసి రండి: ఎమ్మెల్యే బోనెల
పార్వతీపురం రూరల్: రాజకీయాలను పక్కన పెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రజలందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపుని చ్చారు. మంగళవారం కారాడవలస గ్రామంలో ఆయన సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. కారాడవలస అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిందని, అందరూ కలిసివస్తే అన్ని విధాలా అభివృద్ధి చేద్దామన్నరు. ఈ కార్యక్రమంలో గొట్టాపు వెంకటరమణ, సత్యనారాయణ, ఎంపీటీసీ వై.తవిటినాయుడు పాల్గొన్నారు.
Updated Date - Jul 02 , 2025 | 12:09 AM