ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జ్వరంతో బాలింత మృతి

ABN, Publish Date - Jul 20 , 2025 | 11:53 PM

మండలంలోని చీడిమా నుగూడ గ్రామానికి చెందిన బాలింత ఆరిక ప్రియాంక(21) జ్వరంతో విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.

సీతంపేట రూరల్‌, జూలై20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చీడిమా నుగూడ గ్రామానికి చెందిన బాలింత ఆరిక ప్రియాంక(21) జ్వరంతో విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 17న తన స్వగ్రా మం మొగదారగూడ గ్రామానికి బిడ్డతో పాటు ప్రియాంక వచ్చింది. అదే రోజున ఆమెకు జ్వరం రావడంతో తండ్రి బిడ్డిక రాజన్న వైద్యం కోసం సీతంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు, అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి నెల బాబు ఉన్నాడు. ప్రియాంక మృతితో భర్త ఆరిక సుందర్రావు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

Updated Date - Jul 20 , 2025 | 11:53 PM