ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Polycet Counselling జోరుగా పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

ABN, Publish Date - Jun 22 , 2025 | 11:51 PM

Polycet Counselling in Full Swing పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు జోరుగా కౌన్సిలింగ్‌ ప్రక్రియ జరుగుతోది. ఈ నెల 21 నుంచి ప్రక్రియ ప్రారంభమవగా.. తొలిరోజు 1-15 వేలు ర్యాంకుల వరకు, 22న 15,001 నుంచి 32 వేల వరకు ధ్రువపత్రాలు పరిశీలించారు.

చినమేరంగి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల

జియ్యమ్మవలస, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు జోరుగా కౌన్సిలింగ్‌ ప్రక్రియ జరుగుతోది. ఈ నెల 21 నుంచి ప్రక్రియ ప్రారంభమవగా.. తొలిరోజు 1-15 వేలు ర్యాంకుల వరకు, 22న 15,001 నుంచి 32 వేల వరకు ధ్రువపత్రాలు పరిశీలించారు. 23న 32,001 నుంచి 50 వేలు వరకు, 24న 50,001 నుంచి 68 వేలు, 25న 68,001 నుంచి 86 వేలు, 26న 86,001 నుంచి 1,04,000, 27న 1,04,001 నుంచి 1,20,000 వరకు, 28న 1,20,001 నుంచి చివరి ర్యాంకు వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. 25 నుంచి వెబ్‌ ఆప్షన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. జూలై 1న మార్పునకు అవకాశం కల్పించారు. 3న సీట్లు కేటాయించనున్నారు. అభ్యర్థులకు వచ్చిన ర్యాంకులు ఆధారంగా నిర్దేశించిన తేదీల్లో ఐసీఆర్‌ ఫారం నంబరు ద్వారా ఆన్‌లైన్‌లో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో సంబంధిత విద్యార్ధికి ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసి ఇతర వివరాలు పూర్తి చేస్తే కళాశాలల జాబితా కనిపిస్తుంది. దీని ప్రకారం నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు. నేరుగా వారి సెల్‌ ఫోన్‌కే సీటు వచ్చిందో లేదో అనే సమాచారం వస్తుంది. అయితే దీనికోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ కోసం ఈ నెల 27 తుది గడువు ఇచ్చారు. దీనికోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే రూ. 250 చెల్లించాలి. బీసీ, ఓసీలు రూ. 700లు చెల్లించాల్సి ఉంటుంది. తరువాత ఐసీఆర్‌ ఫారం (కౌన్సిలింగ్‌లో అందజేసిన ధ్రువపత్రాల వివరాలు తెలియజేసే ఫారం) విద్యార్ధికి అందజేస్తారు. అయితే రెండు జిల్లాల్లో ప్రభుత్వ కళాశాలలు ఆరు, ప్రైవేటు కళాశాలలు 15 వరకూ ఉన్నాయి. మన్యం జిల్లాలో పార్వతీపురం, చినమేరంగి, గుమ్మలక్ష్మీపురం, సీతంపేటలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది 11,460 మంది పోటీ పడుతున్నారు. ఈ ఆరు ప్రభుత్వ కళాశాలల్లో 1,092 సీట్లు మాత్రమే ఉన్నాయి.విద్యార్థులు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించే రశీదు, హాల్‌ టిక్కెట్‌, ర్యాంకు కార్డు, ఆధార్‌కార్డు, టెన్త్‌ మార్కుల జాబితా, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, టీసీతో హాజరవ్వాల్సి ఉంటుంది.

Updated Date - Jun 22 , 2025 | 11:51 PM