ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యువకుడిపై పోక్సో కేసు నమోదు

ABN, Publish Date - May 21 , 2025 | 12:20 AM

ప్రేమ, పెళ్లి పేరిట బాలికను శారీరకంగా లొంగదీసుకుని మోసం చేసిన మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన పి.నారాయణ(25)పై నెల్లిమర్ల పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు.

నెల్లిమర్ల, మే 20 (ఆంద్రజ్యోతి): ప్రేమ, పెళ్లి పేరిట బాలికను శారీరకంగా లొంగదీసుకుని మోసం చేసిన మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన పి.నారాయణ(25)పై నెల్లిమర్ల పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నారాయణకు ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని ఆ బాలికను నమ్మించి గర్భవతిని చేసి ఆ తర్వాత అబార్షన్‌ చేయించాడు. పెళ్లికి ససేమిరా అనడంతో నెల్లిమర్ల పోలీసులను బాలిక ఆశ్రయించింది. దాంతో నెల్లిమర్ల పోలీసులు నారాయణపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 21 , 2025 | 12:21 AM