Pineapple Park పైనాపిల్ పార్క్‌కు మన్యం అనుకూలం
ABN, Publish Date - Aug 01 , 2025 | 11:56 PM
Pineapple Park Gets Support from Agency Region పైనాపిల్ పార్క్‌కు జిల్లా అనుకూలమని .. ఆ దిశగా చర్యలు చేపట్టాలని మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్‌భరత్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మెప్మా అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పైనాపిల్ పార్క్‌కు జిల్లా అనుకూలమని .. ఆ దిశగా చర్యలు చేపట్టాలని మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్‌భరత్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మెప్మా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ విదేశాల్లో పైనాపిల్‌కు మంచి గిరాకీ ఉంది. ఈ ప్రాంతంలో పైనాపిల్ దిగుబడి అధికంగా ఉన్నందున.. పార్క్ ఏర్పాటుపై దృష్టి సారించాలి. యూనిట్ స్థాపనకు అవసరమైన శిక్షణను నిపుణులతో ఇప్పిస్తాం. చెత్త నుంచి సంపద సృష్టించాలి. ఇంటి వద్దనే వర్మీకంపోస్టును తయారు చేసి విక్రయించొచ్చు. టెర్రాస్ గార్డెన్ ద్వారా ఆకు, కూరగాయలను పండించి ఆదాయం పొందొచ్చు. బ్యాంకు లింకేజీల్లో మరింత పారదర్శకత పెంచేందుకు యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాం. ఇకపై మెప్మా కార్యకలాపాలన్నీ యాప్ ద్వారానే జరగనుంది.’ అని తెలిపారు. ఈ సమావేశంలో మెప్మా పథక సంచాలకులు చిట్టిరాజు, సాంకేతిక నిపుణులు, సీఎంఎంలు, సీవోలు, డీఈవోలు, సీఎల్‌ఆర్‌సీలు పాల్గొన్నారు.
Updated Date - Aug 01 , 2025 | 11:56 PM