ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్యామలాంబ ఉత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు

ABN, Publish Date - May 08 , 2025 | 11:40 PM

సాలూరు శ్యామలాంబ ఉత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ శోభిక అధికారులను ఆదేశించారు.

మాట్లాడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ శోభిక

- శిథిల భవనాలపై భక్తులు ఎక్కకుండా చూడాలి

- ఇన్‌చార్జి కలెక్టర్‌ శోభిక

పార్వతీపురం, మే 8 (ఆంధ్రజ్యోతి): సాలూరు శ్యామలాంబ ఉత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ శోభిక అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత అధికారులతో ఆమె టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి 20 వరకు ఉత్సవాలు జరుగనున్నాయని తెలిపారు. 15 ఏళ్ల తర్వాత జరగనున్న ఉత్సవాలు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జాతరలో భక్తులు శిథిలావస్థ భవనాలపై ఎక్కకుండా చూడాలని ఆదేశించారు. ‘తాగునీరు, విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేయాలి. పూర్తిస్థాయి పారిశుధ్య పనులు చేపట్టాలి. సిరిమాను తిరిగే మార్గాల్లో ఎక్కడా గతుకులు లేకుండా చర్యలు తీసుకోవాలి. వాహనాల పార్కింగ్‌ కోసం ఐదు ప్రదేశాలను గుర్తించాం. ఆ ప్రాంతాలను చదును చేసి విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయాలి. కొన్ని రూట్ల నుంచి బస్సులు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు వస్తాయి. మక్కువ తదితర రూట్లలో వచ్చే బస్సులు, వాహనాలకు పట్టణంలోకి అనుమతి లేదు. వాటిని పార్కింగ్‌ స్థలాల్లో నిలిపేలా చూడాలి.’ అని తెలిపారు. పది రూట్లలో 148 బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ అధికారులు చెప్పారు. మద్యం నియంత్రణకు ఐదు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ అధికారి తెలిపారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో కార్యనిర్వాహక ఇంజనీర్‌ వేణుగోపాలనాయుడు, ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ పి.ధర్మచంద్రారెడ్డి, డీఎస్పీ ఎం.రామబాబు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి టి.కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు అత్యవసర సమావేశం

శ్యామలాంబ పండగ పనులపై శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. శ్యామలాంబ జాతర నేపథ్యంలో రహదారుల నిర్మాణాలు, మరమ్మతులు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు, తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కృషితో సాలూరు పురపాలక సంఘానికి రూ.2కోట్లు మంజూరయ్యాయి. అయితే, నిధులు విడుదలై రెండు నెలలు అవుతున్నా ఇంకా పనులు పూర్తికాలేదు. పండగకు మరో పది రోజుల సమయమే ఉండడంతో ఆలోపు పనులు పూర్తి చేస్తారో లేదోనని సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సాలూరు మున్సిపాలిటీలో వైసీపీ పాలకవర్గం ఉంది. దీంతో పనులు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించి చర్చించనున్నట్లు తెలిసింది. తక్షణం పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - May 08 , 2025 | 11:40 PM