ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pahalgam terror attack is terrible పహల్గాం ఉగ్రదాడి ఘోరం

ABN, Publish Date - Apr 24 , 2025 | 12:14 AM

Pahalgam terror attack is terrible అమాయక పౌరులపై ముష్కరులు దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని, ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముక్త కంఠంతో నినదించాయి. పహల్గాంలో ఉగ్రదాడిపై ఆందోళన వ్యక్తం చేస్తూ కోట జంక్షన్‌ నుంచి బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ

పహల్గాం ఉగ్రదాడి ఘోరం

టీడీపీ, జనసేన, బీజేపీ, ప్రజా సంఘాల భారీ ర్యాలీ

ప్రతి ఒక్కరూ ఖండించాలి: ఎమ్మెల్యే అదితి

విజయనగరం రూరల్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): అమాయక పౌరులపై ముష్కరులు దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని, ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముక్త కంఠంతో నినదించాయి. పహల్గాంలో ఉగ్రదాడిపై ఆందోళన వ్యక్తం చేస్తూ కోట జంక్షన్‌ నుంచి బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ డీసీసీబీ, మూడులాంతర్లు, పైడిమాంబ ఆలయం, గంటస్తంభం మీదుగా కన్యకాపరమేశ్వరీ ఆలయం వరకూ సాగింది. ర్యాలీని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, తూర్పుకాపు కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పాలవలస యశస్విని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేశ్‌వర్మ ప్రారంభించారు. అనంతరం కోట జంక్షన్‌లో మాట్లాడారు. ఇది దారుణమైన సంఘటనగా పేర్కొన్నారు. త్వరలో అమరనాథ్‌ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో ఉగ్రవాదులు ప్రజలను భయకంపితులు చేయడానికే ఈ విధమైన దాడులకు తెగబడ్డారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల ప్రసాద్‌, ఆల్తి బంగారుబాబు, బొద్దల నర్సింగరావు, కర్రోతు నర్సింగరావు, గంటా రవి, బీజేపీ నాయకులు భవిరెడ్డి శివప్రసాద్‌ రెడ్డి, లక్ష్మీనరసింహాం, ఇమంది సుధీర్‌, దళిత సంఘాల నాయకులు, స్వచ్ఛంద సేవా సంఘాల నాయకులు, ఏబీవీపీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:14 AM