ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

One-Stop Center అతివలకు అండగా వన్‌స్టాప్‌ సెంటర్‌

ABN, Publish Date - Jul 16 , 2025 | 11:53 PM

One-Stop Center: A Support System for Women in Distress వన్‌స్టాప్‌ సెంటర్‌ మహిళలకు అండగా ఉంటుందని పార్వతీపురం ఏఎస్పీ అంకితా సురాన తెలిపారు. బుధవారం పార్వతీపురం పట్టణంలో వన్‌స్టాప్‌ సెంటర్‌ను డీఆర్వో హేమలతతో కలిసి సందర్శించారు.

వన్‌స్టాప్‌ సెంటర్‌లో రికార్డులు పరిశీలిస్తున్న ఏఎస్పీ

బెలగాం, జూలై 16(ఆంధ్రజ్యోతి) : వన్‌స్టాప్‌ సెంటర్‌ మహిళలకు అండగా ఉంటుందని పార్వతీపురం ఏఎస్పీ అంకితా సురాన తెలిపారు. బుధవారం పార్వతీపురం పట్టణంలో వన్‌స్టాప్‌ సెంటర్‌ను డీఆర్వో హేమలతతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్‌లోని రికార్డులు తనిఖీ చేశారు. పోక్సో కేసుల బాధితులకు అందిస్తున్న సేవల వివరాలపై ఆరా తీశారు. పనుల ప్రదేశంలో మహిళల రక్షణ కోసం ఇప్పటివరకు 435 ఇంటర్నల్‌ కంప్లైట్‌ కమిటీల ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆయా కమిటీల నుంచి ప్రతి నెల నివేదకలు తెప్పించుకోవాలని ఏఎస్పీ సూచించారు. మహిళలు ధైర్యంగా పనిచేసుకునేలా ఇంటర్నల్‌ కంప్లైట్‌ కమిటీలు పని చేయాలన్నారు. వన్‌స్టాప్‌ సెంటర్‌ కోసం కేటాయించిన స్థలంలో నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. ఐసీడీఎస్‌ పీడీ టి.కనకదుర్గ, ఎస్‌ఐ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 11:53 PM