ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఒక్కరోజే గడువు

ABN, Publish Date - Jun 08 , 2025 | 11:56 PM

ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో గత 25 రోజుల నుంచి బదిలీలు జరుగుతున్నాయి.

- నేటితో ముగియనున్న ఉద్యోగ బదిలీల ప్రక్రియ

- నిబంధనలు పాటించడం లేదంటున్న రెవెన్యూ, డీఆర్‌డీఏ ఉద్యోగులు

విజయనగరం కలెక్టరేట్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో గత 25 రోజుల నుంచి బదిలీలు జరుగుతున్నాయి. దీంతో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకూ పని చేసే పలువురు ఉద్యోగులు కొత్త స్థానాలకు మారారు. ఈనెల 2తోనే బదిలీల ప్రక్రియ పూర్తి కావల్సి ఉన్నా ప్రభుత్వం ఈ నెల 9 (సోమవారం)వరకు గడువు పెంచింది. కాగా, రెవెన్యూ, డీఆర్‌డీఏలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు బదిలీలపై గుర్రుమంటున్నారు. బదిలీల్లో నిబంధనలు పక్కన పెట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో డీఆర్‌డీఏలో 53మంది ఏపీఎంలు, 11 మంది డీపీఎంలు ఉన్నారు. అయితే, పోస్టుల సంఖ్యల తగ్గించడంతో జిల్లాలో 22 మంది ఏపీఎంలు, ఆరుగురు డీపీఎంలు అదనంగా ఉన్నారు. దీంతో వీరు ఈ నెల ఒకటో తేదీన విజయవాడలోని సెర్ప్‌ కార్యాలయంలో జరిగిన కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. వీరికి పోస్టులు ఎక్కడ కేటాస్తారు? అనేది తెలియాల్సి ఉంది. 16 మంది ఏపీఎంలలో ఇద్దరు అనకాపల్లి జిల్లాను, ఒకరు అల్లూరుసీతారామారాజు జిల్లాను, తొమ్మిది మంది కాకినాడ, మిగతా నలుగురు తూర్పుగోదావరి జిల్లాను కోరుకున్నారు. అయితే ఏపీఎంలను జోన్‌ పరిధిలో మాత్రమే బదిలీ చేయాలని జీవోలో పొందుపరిచినా, ఇప్పుడు జోన్‌ పరిధి దాటి బదిలీ చేయడంపై వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆ శాఖలో గందరగోళం నెలకొంది.

- రెవెన్యూ శాఖకు సంబంధించి ఎస్‌.కోట, నెల్లిమర్ల, రాజాం నియోజకవర్గాల్లో పని చేసిన ఉద్యోగులకు మాత్రమే బదిలీలు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. తమను ఎందుకు బదిలీ చేశారో? తెలియడం లేదని ఎస్‌.కోట నియోజకవర్గానికి చెందిన కొంతమంది వీఆర్వోలు గగ్గోలు పెడుతున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. కొందరు వీర్వోలను సొంత జిల్లాకు కాకుండా పక్క జిల్లా పార్వతీపురం మన్యంకు మార్చడంపై మదనపడుతున్నారు. కొందరు దరఖాస్తు చేసుకోక పోయినా? ఒకేచోట ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి కాకపోయినా వారిని బదిలీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్‌ గ్రేడ్‌-1 నుంచి 4 వరకూ పని చేసే కార్యదర్శుల బదిలీల్లో సిఫారసులకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బదిలీలకు ఒక్కరోజే గడువు ఉండడంతో ఎంతమంది కొత్త స్థానాలకు వెళ్తారో? చూడాలి.

Updated Date - Jun 08 , 2025 | 11:56 PM