Odisha to Visakhapatnam ఒడిశా టూ విశాఖ
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:14 AM
Odisha to Visakhapatnam గంజాయిని ఒడిశా నుంచి విశాఖకు తరలిస్తుండగా జిల్లా పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఈగల్ విభాగం, పోలీసులు కలిసి మానాపురం గేటు వద్ద తనిఖీలు చేపట్టి రవాణాను అడ్డుకున్నారు. ఇద్దరు నిందితులను పట్టుకుని వారి నుంచి 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారయ్యారు. ఎస్పీ వకుల్‌జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు.
ఒడిశా టూ విశాఖ
గంజాయి తరలిస్తుండగా గుర్తించిన జిల్లా పోలీసులు
230 కిలోల గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ వకుల్‌జిందాల్
విజయనగరం క్రైం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): గంజాయిని ఒడిశా నుంచి విశాఖకు తరలిస్తుండగా జిల్లా పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఈగల్ విభాగం, పోలీసులు కలిసి మానాపురం గేటు వద్ద తనిఖీలు చేపట్టి రవాణాను అడ్డుకున్నారు. ఇద్దరు నిందితులను పట్టుకుని వారి నుంచి 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారయ్యారు. ఎస్పీ వకుల్‌జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు.
ఈ నెల 13న ఈగల్ టీమ్, మానాపురం పోలీసులకు గంజాయి రవాణాపై స్పష్టమైన సమాచారం అందింది. దీంతో దత్తిరాజేరు మండలం పెదమానాపురం రైల్వేగేటు సమీపంలో తనిఖీలు చేపట్టారు. సాలూరు వైపు నుంచి రెండు కార్లలో వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి కొద్దిదూరంలో నిలిపారు. కార్లు వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కొరాపుట్ జిల్లా పొట్టంగి మండలం సదం పంచాయతీ జంగారాడ గ్రామానికి చెందిన గాసిరామ్ హంతల్, కొరాపుట్ జిల్లా సిమిలిగూడ మండలం దళాయిగూడ పంచాయతీ జలియాగూడ గ్రామానికి చెందిన కరక్‌కిలోను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా సురేష్ అడకాటియా, అనిలా, జున్నేష్‌లు పరారయ్యారని తెలిపారు. సురేష్ అడకాటియా కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతని కోసం గాలిస్తున్నారు. ఇద్దరి నిందితుల నుంచి రెండు కార ్లను 44 ప్యాకెట్లుగా ఉన్న 230 కిలోల గంజాయి, 3 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. గాసిరామ్ హంతల్‌పై ఏడు బైక్ చోరీలు కేసులు ఉన్నాయని, కరక్‌కిలో గంజాయి తరలించేందుకు మారుతీ కారును అద్దెకు తీసుకున్నారని ఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి, గజపతినగరం సీఐ రమణ, మానాపురం ఎస్‌ఐ జయంతి పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2025 | 12:15 AM