ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NTR's birthday is celebrated with great enthusiasm. సందడిగా ఎన్టీఆర్‌ జయంతి

ABN, Publish Date - May 29 , 2025 | 12:02 AM

NTR's birthday is celebrated with great enthusiasm.న్టీఆర్‌ 102వ జయంతి ఉత్సవాలు విజయనగరం కలెక్టరేట్‌లో బుధవారం సందడిగా సాగాయి. ప్రభుత్వం అధికారికంగా చేపట్టడంతో కలెక్టర్‌ అంబేడ్కర్‌, జేసీ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తొలుత ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. తెలుగుజాతికి గౌరవం, గుర్తింపు తెచ్చిన తెలుగుజాతి కీర్తికిరీటం దివంగత మాజీ ముఖ్యమంత్రి, పద్మశ్రీ, నందమూరి తారకరామారావు అని అధికారులు, అభిమానులు కీర్తించారు.

ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

సందడిగా ఎన్టీఆర్‌ జయంతి

ఆకట్టుకున్న ఏకపాత్రాభినయ ప్రదర్శనలు, ఫొటో గ్యాలరీ

విజయనగరం, మే 28 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ 102వ జయంతి ఉత్సవాలు విజయనగరం కలెక్టరేట్‌లో బుధవారం సందడిగా సాగాయి. ప్రభుత్వం అధికారికంగా చేపట్టడంతో కలెక్టర్‌ అంబేడ్కర్‌, జేసీ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తొలుత ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. తెలుగుజాతికి గౌరవం, గుర్తింపు తెచ్చిన తెలుగుజాతి కీర్తికిరీటం దివంగత మాజీ ముఖ్యమంత్రి, పద్మశ్రీ, నందమూరి తారకరామారావు అని అధికారులు, అభిమానులు కీర్తించారు. ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రముఖ రంగస్థల నటుడు కందుల గుణేశ్వరావు శ్రీకృష్ణుడిగా, నంది అవార్డు గ్రహీత ముళ్లపూడి రామచంద్రరావు ధుర్యోదనుడిగా ఏకపాత్రాభినయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మయసభ ఘట్టం కళాభిమానులను కట్టిపడేసింది. నంది అవార్డు గ్రహీత మురళీ హార్మోనియా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే విధంగా ఎన్టీఆర్‌ జీవిత విశేషాలతో కూడిన ఫొటో గ్యాలరీని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా తిలకించారు. మహారాజా ప్రభుత్వ నృత్య కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం కలెక్టర్‌ అంబేడ్కర్‌ కళాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి గొప్పతనాన్ని, గౌరవాన్ని ప్రపంచ స్థాయికి చేర్చిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని అన్నారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, డీఆర్‌వో మురళి, సీపీవో బాలజీ, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ బోని రామానందం, బీశెట్టి బాబ్జీ, సాహితీవేత్త నాలుగుఎస్‌ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 03:04 PM