NTR తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్
ABN, Publish Date - May 28 , 2025 | 11:42 PM
NTR: A Symbol of Telugu Pride and Self-Respect తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను బుదవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
కలెక్టరేట్‌లో ఘనంగా జయంతి వేడుకలు
పార్వతీపురం, మే 28(ఆంధ్రజ్యోతి): తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను బుదవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తెలుగువారి గొప్పతనాన్ని దశ దిశల చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు. తెలుగుభాషకు దేశవ్యాప్తంగా గుర్తింపుతెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వేడుకల్లో భాగంగావిద్యార్థినులు శాస్ర్తీయ నృత్యాలతో అదరగొట్టారు. అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం ప్రదర్శనతో రిటైర్డ్ ఉపాధ్యాయుడు బోనెల ప్రకాష్‌బాబు అందర్నీ అలరించారు. సమాచార పౌర సంబంధాలశాఖ ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని ప్రతిఒక్కరూ ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో జేసీ శోభిక, డీఆర్వో కె.హేమలత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మాచంద్రారెడ్డి, డీపీఆర్వో రమేష్, వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్, డీఆర్‌డీఏ పీడీఎం.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల అవసరాలు గుర్తించండి
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల అవసరా లను గుర్తించి నివేదిక సిద్ధం చేయాలని, వారికి అవసరమైన ధ్రువపత్రాలు జారీ చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. ‘ధరి ఆబా జన జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’పై జూన్ 15 నుంచి 30 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆధార్, రేషన్, ఆయు ష్మాన్‌భారత్ కార్డులు,పింఛన్లు తదితర వాటిని గిరిజనులకు అందించాలని సూచించారు. ఈకేవైసీ, డాక్యుమెంటేషన్ సేవలు కూడా అందించనున్నట్లు వెల్లడించారు.
Updated Date - May 30 , 2025 | 03:06 PM