ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Not a Trace of Mercy! కని‘కరి’ంచట్లే!

ABN, Publish Date - May 28 , 2025 | 11:34 PM

Not a Trace of Mercy! : గత కొద్దిరోజులుగా తోటపల్లి, సుంకి ప్రాంతాల్లో సంచరించిన గజరాజులు బుధవారంనందివానివలసలో ప్రత్యక్షమయ్యాయి. ఆ గ్రామ పరిధిలోని తామర చెరువులో సంచరించాయి. దీంతో ఆ ప్రాంతవాసులు హడలెత్తిపోతున్నారు.

నందివానివలస తామర చెరువు ప్రాంతంలో సంచరిస్తున్న గజరాజులు

గరుగుబిల్లి, మే 28(ఆంధ్రజ్యోతి): గత కొద్దిరోజులుగా తోటపల్లి, సుంకి ప్రాంతాల్లో సంచరించిన గజరాజులు బుధవారంనందివానివలసలో ప్రత్యక్షమయ్యాయి. ఆ గ్రామ పరిధిలోని తామర చెరువులో సంచరించాయి. దీంతో ఆ ప్రాంతవాసులు హడలెత్తిపోతున్నారు. నందివానివలసతో పాటు గిజబ, జియ్యమ్మవలస మండలం సింగనాపురం, చింతల బెలగాం, చినకుదమ, పెదకుదమ గ్రామాలు పక్కపక్కనే ఉన్నాయి. దీంతో అవి ఏ సమయంలోగ్రామాల వైపు వస్తాయోనన్న గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అరటి, పామాయిల్‌ పంటలకు నష్టం వాటిల్లకుండా చూడాలని, గజరాజులు ప్రధాన రహదారిపైకి, గ్రామాల్లోకి రాకుండా అటవీ సిబ్బంది, ట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు. ఖరీఫ్‌ సమయం దగ్గరపడడంతో వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నామని, సంబంధిత అధికారులు దృష్టి సారించి సురక్షిత ప్రాంతాలకు వాటిని తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - May 30 , 2025 | 03:06 PM