ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఒక్కరు కూడా హాజరుకాలే..

ABN, Publish Date - May 21 , 2025 | 12:04 AM

పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో మంగళవారం జరిగిన పదో తరగతి ఇంగ్లీష్‌ సప్లిమెంటరీ పరీక్షకు ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదు.

పరీక్ష కేంద్రంలో లేని విద్యార్థులు

- ‘పది’ సప్లిమెంటరీ పరీక్ష రాయని విద్యార్థులు

- నిరీక్షించిన పరీక్ష కేంద్రం సిబ్బంది

పాలకొండ, మే 20 (ఆంధ్రజ్యోతి): పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో మంగళవారం జరిగిన పదో తరగతి ఇంగ్లీష్‌ సప్లిమెంటరీ పరీక్షకు ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదు. ఈ పరీక్షను ఆరుగురు విద్యార్థులు రాయాల్సి ఉంది. దీనికోసం ఈ పరీక్ష కేంద్రానికి చీఫ్‌సూపరింటెండెంట్‌ జి.రవిప్రసాద్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి డి.నాగమణి, ఇన్విజిలేటర్‌ ఎ.బాబూరావుతో పాటు క్లర్క్‌, ఆఫీస్‌ సబార్డినేటర్‌, స్వీపర్‌, వాటర్‌మన్‌లను నియమించారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. అయితే, ఒక్క విద్యార్థి కూడా హాజరుకాకపోవడంతో సమయం ముగిసే వరకూ పరీక్ష కేంద్రం సిబ్బంది నిరీక్షించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు.

Updated Date - May 21 , 2025 | 12:04 AM