ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

upadhi Works ఉపాధి పనుల్లో అలసత్వం వద్దు

ABN, Publish Date - Mar 19 , 2025 | 11:29 PM

No Negligence in upadhi Works ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపడుతున్న పనుల్లో అలసత్వం వద్దని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు.

టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం రూరల్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపడుతున్న పనుల్లో అలసత్వం వద్దని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఉపాధిహామీ పథకంలో చేపడుతున్న ప్రహరీలు, మినీగోకులాలు, ఇంకుడు గుంతలు, ఫారంపాడ్స్‌, ఫిష్‌పాండ్స్‌, రహదారులు తదితర పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలో 334 ప్రహరీలు మంజూరు చేశామని, వాటిల్లో 311 గ్రౌండింగ్‌ కాగా, 67 పూర్తయ్యాయని తెలిపారు. భామిని, పాచిపెంట, సాలూరు, కురుపాం, పార్వతీపురం, సీతానగరం మండలాల్లో ప్రగతి కనిపించాలన్నారు. 988 మినీ గోకులాలు మంజూరు చేస్తే 894 గ్రౌండింగ్‌ అయ్యాయని, వాటిలో 113 పూర్తయ్యాయని వెల్లడించారు. 7,342 ఇంకుడు గుంతలకు గాను 4,284 పనులు పూర్తి చేశారన్నారు. 11,250 ఫారంపాండ్స్‌ నిర్మాణాలు లక్ష్యం కాగా 7,986 మంజూరు చేశామని, వాటిలో 927 పూర్తి చేసినట్లు చెప్పారు. సీతంపేట, సీతానగరం, జీఎల్‌పురం, వీరఘట్టం, సాలూరు, పాలకొండ, పాచిపెంట మండలాల్లోని పనుల్లో పురోగతి కనిపించడం లేదని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ కె.రామచం ద్రరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారి ఓ.ప్రభాకరరావు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 11:29 PM