ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

government offices అధ్వానంగా ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు

ABN, First Publish Date - 2025-05-04T23:26:19+05:30

Neglected surroundings of government offices జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు అధ్వానంగా మారాయి. ఎటుచూసినా పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాలే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర నిర్వహిస్తున్నా ఆయా కార్యాలయాల్లో మాత్రం పరిస్థితి మారడం లేదు. స్వచ్ఛత కానరావడం లేదు.

పాలకొండ నడిబొడ్డున ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయ ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు

పాలకొండ, మే4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు అధ్వానంగా మారాయి. ఎటుచూసినా పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాలే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర నిర్వహిస్తున్నా ఆయా కార్యాలయాల్లో మాత్రం పరిస్థితి మారడం లేదు. స్వచ్ఛత కానరావడం లేదు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్యాలయాలెన్నో ఉన్నాయి. వాటిల్లో 70 వరకు వివిఽధ శాఖలు ఉన్నాయి. జిల్లా, డివిజన్‌, మండల, గ్రామస్థాయిలోనూ కార్యాలయాలున్నాయి. అయితే కొన్నిచోట్ల ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలు పిచ్చిమొక్కలతోనే కనిపిస్తుండడంతో సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. వివిధ శాఖల ఉద్యోగులు నెలలో మూడో శనివారం పారిశుధ్యం మెరుగుకు కనీసం గంట పాటు కష్టపడితే కార్యాలయాల్లో పరిస్థితి మారుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. విష సర్పాలు, పురుగులు లోనికి రాకుండా.. పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాలు తొలగిస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత సాధ్యమవుతుంది. ఇందుకోసం ఉద్యోగలు, సిబ్బంది బాధ్యత తీసుకోవాలి. అలా చేయడం ద్వారా స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర సాకారమవుతుందని , ఆ దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. దీనిపై పాలకొండ ఎంపీడీవో రంగారావును వివరణ కోరగా.. ‘ కార్యాలయాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. గ్రామస్థాయి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధిగా స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించాలి. ప్రతి నెలా మూడో శనివారం ఉద్యోగులు, అధికారులు ఇందులో భాగస్వాములవ్వాలి. అదేవిధంగా ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం చేపట్టి పరిసరాలు పరిశుభ్రతకు కృషి చేయాలి.’ అని తెలిపారు.

Updated Date - 2025-05-04T23:26:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising