Law and Order శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండాలి
ABN, Publish Date - May 30 , 2025 | 11:25 PM
Must Take the Lead in Maintaining Law and Order శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులంతా ముందుండాలని ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. శుక్రవారం పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో సిబ్బందితో సమీక్షించారు.
పార్వతీపురం టౌన్/ బెలగాం, మే30 (ఆంరఽధజ్యోతి) : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులంతా ముందుండాలని ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. శుక్రవారం పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో సిబ్బందితో సమీక్షించారు. ‘ సైబర్ నేరాలు, గంజాయి, నాటుసారా రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. క్షేత్రస్థాయిలో ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే రాత్రి వేళ గస్తీ సమయంలో వాహన తనిఖీలను ముమ్మరం చేయాలి. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. రైల్వే, స్థానిక పోలీసుల సమన్వయంతో ముందుకు సాగాలి. పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత ప్రచారం చేపట్టాలి.’ అని ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో ప్రత్యేక ప్రతిభ కన బరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అంద జేశారు. ఈ సమీక్షలో పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, ఎస్బీ సీఐ రంగనాథం, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 30 , 2025 | 11:25 PM