murder మద్యంమత్తులో హత్య
ABN, Publish Date - May 20 , 2025 | 11:48 PM
murder ఎస్.కోట నియోజకవర్గంలో మరో హత్య కలకలం సృష్టించింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి పారిశుధ్య కార్మికుడిని హత్య చేశాడు. కొద్దిరోజుల క్రితం ఎస్.కోట మండలం చామాలపల్లిలో హత్య జరిగింది.
మద్యంమత్తులో హత్య
కుమరాంలో ఘటన
నిందితుడు పాత నేరస్థుడే?
జామి, మే 20(ఆంధ్రజ్యోతి): ఎస్.కోట నియోజకవర్గంలో మరో హత్య కలకలం సృష్టించింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి పారిశుధ్య కార్మికుడిని హత్య చేశాడు. కొద్దిరోజుల క్రితం ఎస్.కోట మండలం చామాలపల్లిలో హత్య జరిగింది. మూడురోజుల క్రితం ఇదే మండలంలోని వెంకటరమణపేటలో వివాహిత హత్య ఉదంతం మరువకముందే జామి మండలంలోని కుమరాం గ్రామంలో తాజాగా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కుమారాం గ్రామంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఎద్దు సూర్యనారాయణ(48) ఎప్పటిలాగే మంగళవారం గ్రామంలో పనులు చేసుకుంటూ ఎస్సీకాలనీ రచ్చబండ వద్ద కూర్చున్నాడు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న గ్రామస్థుడు వంకా రవి అటుగా వస్తూ సూర్యనారాయణతో గొడవ పడ్డాడు. వారి మధ్య మాటమాట పెరిగాక కోపోద్రిక్తుడై మెడపైనా, కాళ్లుచేతులపైనా తీవ్రంగా గాయపరిచాడు. ఆర్తనాథాలు చేస్తూ సూర్యనారాయణ ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్దామనుకునే సరికి మృతిచెందాడు. సమాచారం అందుకున్న సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ వీరజనార్దన్ గ్రామానికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. కాగా నిందితుడిపై ఇప్పటికే పలు పోలీస్ కేసులు ఉన్నాయని స్థానికులు తెలిపారు. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడంటున్నారు. సూర్యనారాయణ కుమారుడు రశ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. నిందితుడు రవిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Updated Date - May 20 , 2025 | 11:48 PM