విధుల్లో చేరిన ఎంటీఎస్ ఉపాధ్యాయులు
ABN, Publish Date - Jun 24 , 2025 | 12:06 AM
ఎంటీఎస్ ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరారు.
సాలూరు రూరల్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఎంటీఎస్ ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఎంటీఎస్ ఉపాధ్యాయులకు ఆదివారం బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించిన విషయం విదితమే. ఉమ్మడి జిల్లాలో 99 మంది 2008 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయులు, 376 మంది 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో 147 క్లస్టర్ ఉన్నత పాఠశాలల్లో 475 ఖాళీలను చూపారు. వారు కౌన్సెలింగ్‌లో తమకు అనువైన చోటును ఎంపిక చేసుకున్నారు. వారందరికీ ఆర్డర్లు సైతం జారీ చేశారు. వారంతా కొత్త స్థానానికి కేటాయించిన ఆర్డర్‌తో పాటు ఒప్పంద అగ్రిమెంట్‌ను తమ కొత్తస్థానం ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. క్లస్టర్ పాఠశాలల్లో బోధనకు ఎంటీఎస్ ఉపాధ్యాయులను వినియోగిస్తామని శివరాంపురం క్లస్టర్ ప్రధానోపాధ్యాయుడు ఆలమూరి ఉమామహేశ్వరరావు అన్నారు.
Updated Date - Jun 24 , 2025 | 12:06 AM