నాగావళికి స్వల్ప వరద
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:25 AM
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి సోమవారం స్వల్ప వరద పోటెత్తింది.
గరుగుబిల్లి, జూలై 7(ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి సోమవారం స్వల్ప వరద పోటెత్తింది. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 5 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహం నదిలోకి చేరుతోంది. అధికారులు ముందస్తుగా స్పిల్‌వే గేట్ల నుంచి దిగువ ప్రాంతాలకు 4,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం వర్షాల కారణంగా రైతులకు సాగునీరు అవసరం లేకపోవడంతో పాత బ్యారేజీ పరిధిలోని రెండు కాలువల నుంచి సాగునీరు విడుదల చేయలేదు. ఉల్లిభద్ర పరిధిలోని కుడి ప్రధాన కాలువ నుంచి చెరువులను నింపుకొనేందుకు ముందస్తుగా 100 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 103.90 మీటర్ల నీటి నిల్వ ఉంది. వరద కారణంగా కొంతమేర దిగువకు విడుదల చేస్తున్నారు. 2.534 టీఎంసీలకు గాను 1.848 టీఎంసీల నిల్వ ఉంది. వరద ప్రవాహం అధికంగా వచ్చినా... నదీ తీరవాసులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రాజెక్టు ఈఈ హెచ్.మన్మఽథరావు తెలిపారు.
Updated Date - Jul 08 , 2025 | 12:25 AM