Thotapalli తోటపల్లికి స్వల్ప వరద
ABN, Publish Date - Jul 25 , 2025 | 11:27 PM
Mild Flooding in Thotapalli తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో శుక్రవారం స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. గత మూడు రోజులుగా పైప్రాంతం ఒడిశాతోపాటు జిల్లాలోనూ వర్షాలు కురుస్తుండడంతో నదిలోకి 3,720 క్యూసెక్కుల వరద చేరింది.
గరుగుబిల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో శుక్రవారం స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. గత మూడు రోజులుగా పైప్రాంతం ఒడిశాతోపాటు జిల్లాలోనూ వర్షాలు కురుస్తుండడంతో నదిలోకి 3,720 క్యూసెక్కుల వరద చేరింది. దీంతో శుక్రవారం ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై స్పిల్‌వే గేట్లు నుంచి దిగువ ప్రాంతాలకు 3,044 క్యూసెక్కులను విడుదల చేశారు. ఖరీఫ్‌కు సంబంధించి కుడి ప్రధాన కాలువ నుంచి 850 క్యూసెక్కులు, పాత రెగ్యులేటర్ పరిధిలోని కాలువల నుంచి 260 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 105 మీటర్లకు గాను ప్రస్తుతం 103.7 మీటర్ల స్థాయికి నీరు చేరిందని పాజెక్టు ఈఈ హెచ్.మన్మఽథరావు తెలిపారు. 2.534 టీఎంసీలకు గాను 1.791 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. వర్షాల కారణంగా నదీ తీర ప్రాంతాల్లో ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని తహసీల్దార్ పి.బాల, ఎంపీడీవో జి.పైడితల్లి ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - Jul 25 , 2025 | 11:27 PM