Yogandhra Competitions రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీల్లో మెరిసిన మన్యం
ABN, Publish Date - Jun 18 , 2025 | 11:30 PM
Manyam Shines in State-Level Yogandhra Competitions యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వివిధ పోటీల్లో జిల్లావాసులు సత్తాచాటారు. జిల్లా పోటీల్లో విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయికి వెళ్లిన వారు మొత్తంగా 10 బహుమతులు సాధించి మన్యాన్ని ద్వితీయ స్థానంలో నిలబెట్టారు.
సత్తాచాటిన జిల్లావాసులు
విజేతలను అభినందించిన కలెక్టర్
పార్వతీపురం, జూన్ 18(ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వివిధ పోటీల్లో జిల్లావాసులు సత్తాచాటారు. జిల్లా పోటీల్లో విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయికి వెళ్లిన వారు మొత్తంగా 10 బహుమతులు సాధించి మన్యాన్ని ద్వితీయ స్థానంలో నిలబెట్టారు. ఈ నెల 16, 17 తేదీల్లో 13 విభాగాల్లో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించారు. ఇందులో 10 విభాగాల్లో జిల్లావాసులు విజేతలుగా నిలిచారు. మూడు ప్రథమ , రెండు ద్వితీయ , మూడు తృతీయ బహుమతులను దక్కించుకున్నారు.
విజేతలుగా నిలిచిన వారు...
యోగా సోలో (19నుంచి 35 సంవత్సరాలు) విభాగంలో జిల్లాకు చెందిన సీహెచ్ దీపక్‌నాయుడు, పాటల పోటీల్లో పి.భాగ్యరాధ, షార్ట్‌ఫిల్మ్ పోటీల్లో కె.జనార్థనరావులు ప్రథమస్థానంలో నిలిచారు. 35 సంవత్సరాల పైబడిన వారికి నిర్వహించిన యోగా పోటీల్లో వై.కైలాసరావు ద్వితీయ స్థానం దక్కించు కున్నారు. ఆయనకు రూ. 30 వేలు నగదు బబహుమతి అందించారు. 25 సంవత్సరాలు పైబడిన వారికి నిర్వహించిన యోగా గ్రూప్ పోటీల్లో అనిల్‌కుమార్‌శర్మకు ద్వితీయ బహుమతి లభించింది. 19 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న వారికి నిర్వహించిన యోగా, వ్యాసరచన పోటీల్లో కె.శిరీష్‌కు రా ష్ట్రస్థాయిలో తృతీయ బహుమతి లభించింది. షార్ట్‌ఫిల్మ్ పోటీల్లో ఎం.ఇంద్రాని, గ్రూప్ యోగా పోటీల్లో జిల్లాకు చెందిన సూర్య గంటి బృందం మూడో స్థానం దక్కించుకున్నారు. యోగా పోస్టర్ జూనియర్ విభాగంలో కె.హేమమాలి, యోగా స్కిట్ రోల్‌ప్లేడ్‌లో డి.దినేష్‌కుమార్ బృందం తృతీయ బహుమతి పొందారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో విజేతలకు మంత్రులు సత్యకుమార్‌యాదవ్, కందుల దుర్గేష్ బహుమతులు అందించారు. రా ష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచిన జిల్లావాసులను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఇతర అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా నుంచి నోడల్ అధికారిగా వెళ్లిన గిరిజన సంక్షేమశాఖాధికారి కృష్ణవేణి, జిల్లా పబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్ రఘు, ఆయుష్ డిపార్ట్‌మెంట్ కన్వీనర్ వర్మ, యోగా గురువు మోహన్ గంట, యూత్ అధికారులు జిల్లా నుంచి విజయవాడ వెళ్లిన జిల్లావాసుల బృందానికి అన్నింటా అండగా నిలిచారు.
Updated Date - Jun 18 , 2025 | 11:30 PM