ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

'Janaganana ‘జనగణన’తో మార్పులెన్నో..

ABN, Publish Date - Jun 17 , 2025 | 11:33 PM

Many Changes Through 'Janaganana జనగణనకు కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. మొదటి దశలో భాగంగా.. ప్రజల ఇంటి పరిస్థితులు, వారి ఆస్తులు, ఇళ్లలో ఉండే సౌకర్యాల వివరాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియను 2026, ఏప్రిల్‌లోనే ప్రారంభించనున్నట్టు సమాచారం. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 225కు పెరగనున్నాయి. అంటే దాదాపు 50 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే జిల్లాలో ప్రస్తుతం ఉన్న నాలుగు నియోజకవర్గాల సంఖ్య ఐదు లేదా ఆరుకు పెరగనుందని ఓ అంచనా. అరకు పార్లమెంట్‌ను కూడా రెండుగా విభజించ నున్నారు.

  • అరకు పార్లమెంట్‌ను రెండుగా విభజించే అవకాశం

  • నియోజకవర్గ స్వరూపాలు, రిజర్వేషన్లూ మారే చాన్స్‌

  • ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల్లో విస్తృత చర్చ

పార్వతీపురం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): జనగణనకు కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. మొదటి దశలో భాగంగా.. ప్రజల ఇంటి పరిస్థితులు, వారి ఆస్తులు, ఇళ్లలో ఉండే సౌకర్యాల వివరాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియను 2026, ఏప్రిల్‌లోనే ప్రారంభించనున్నట్టు సమాచారం. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 225కు పెరగనున్నాయి. అంటే దాదాపు 50 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే జిల్లాలో ప్రస్తుతం ఉన్న నాలుగు నియోజకవర్గాల సంఖ్య ఐదు లేదా ఆరుకు పెరగనుందని ఓ అంచనా. అరకు పార్లమెంట్‌ను కూడా రెండుగా విభజించ నున్నారు. జిల్లాలో రిజర్వేషన్లూ మారుతాయి. కుల, జనగణన అనంతరం నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. దీనివల్ల నియోజకవర్గాల స్వరూపాలు మారిపోతాయి. కుదింపులు, చేర్పులు, మార్పులతో నియోజకవర్గాల సంఖ్య పెరగనుంది. జిల్లా పరిధిలో పెరిగే అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటినీ కలుపుకుని ఒక ప్రత్యేక పార్లమెంట్‌ స్థానం ఏర్పాటు చేయొచ్చు. అరకు పార్లమెంట్‌ ఏర్పటవక ముందు ఉన్న పార్వతీపురం పార్లమెంట్‌ను పునరుద్ధరించే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తంగా అసెంబ్లీకి లేదా పార్లమెంట్‌కు పోటీ చేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆశావహుల్లో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది.

ఓటర్లు ఇలా..

పాలకొండ నియోజకవర్గంలో 1,97,976 మంది ఓటర్లు ఉన్నారు. కురుపాంలో 1,91,112 మంది, పార్వతీపురంలో 1,88,090 మంది, సాలూరులో 1,97,395 మంది ఓటర్లు ఉన్నారు. పాలకొండ, సాలూరు, కురుపాం నియోజకవర్గాలు ఎస్టీగా, పార్వతీపురం నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్‌ పరిధిలో ఉన్నాయి.

నియోజకవర్గాల స్వరూపాలు...

సాలూరు నియోజకవర్గంలో సాలూరు పట్టణం, మండలం, మెంటాడ , పాచిపెంట, మక్కువ మండలాలు ఉన్నాయి. భౌగోళికంగా చూస్తే మెంటాడ విజయగనరం జిల్లాలో కలిసే అవకాశం ఉంది. పార్వతీపురం నియోజకవర్గంలో పార్వతీపురం పట్టణం, మండలం సీతానగరం, బలిజిపేట మండలాలు ఉన్నాయి. కురుపాం నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాలు ఉన్నాయి. అయితే గరుగుబిల్లి, బలిజిపేట మండలాలు విజయనగరం జిల్లా బొబ్బిలి అర్బన్‌లో కలిసి ఒక నియోజకవర్గంగా ఏర్పడనున్నాయి. కొమరాడ మండలం పార్వతీపురంలో కలిసే వీలుంది. పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ నగర పంచాయతీ, మండలంతో పాటు భామిని, సీతంపేట, వీరఘట్టం మండలాలు ఉన్నాయి. భామిని మండలం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లే అవకాశం ఉంది. కుల, జనగణన అనంతరం నియోజకవర్గాల ఏర్పాటుపై స్పష్టత రానుంది. ఏ నియోజకవరంలో ఏ సామాజిక వర్గం ఉండాలి.. ఎంతమంది ఓటర్లు, జనాభా ఉండాలనే ది కూడా తేల్చనున్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:33 PM