ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యువతిపై వేధింపులకు పాల్పడిన వ్యక్తికి ఏడాది జైలు

ABN, Publish Date - Jul 18 , 2025 | 12:09 AM

యువతిపై వేధింపులకు పాల్పడిన కేసులో ఓ వ్యక్తికి ఏడాది సాధారణ జైలు, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ విజయనగరం మహిళా కోర్టు కమ్‌ 5వ ఏడీజే కోర్టు న్యాయాధికారి ఎన్‌.పద్మావతి తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం మహిళా పీఎస్‌ డీఎస్పీ ఆర్‌.గోవిందరావు తెలిపారు.

విజయనగరం క్రైం, జూలై 17(ఆంధ్రజ్యోతి): యువతిపై వేధింపులకు పాల్పడిన కేసులో ఓ వ్యక్తికి ఏడాది సాధారణ జైలు, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ విజయనగరం మహిళా కోర్టు కమ్‌ 5వ ఏడీజే కోర్టు న్యాయాధికారి ఎన్‌.పద్మావతి తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం మహిళా పీఎస్‌ డీఎస్పీ ఆర్‌.గోవిందరావు తెలిపారు. ఆయన గురువారం స్థానిక విలేకర్లకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లాకు చెందిన ముప్పాల అశ్విన్‌ నెలిమర్ల మిమ్స్‌ కళాశాలలో 2023 సంవత్సరం లో చదువుతున్న సమయంలో అదే కళాశాలలో చదువుతున్న ఒక యువ తితో పరిచయం ఏర్పరుచుకుని వివిధ సందర్భాల్లో ఆమెను వేధించాడు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి మహిళా పీఎస్‌ ఎస్‌ఐ పద్మావతి కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కోర్టు విచారణలో అశ్విన్‌రెడ్డి వేధింపుల కు పాల్పడినట్లుగా రుజువు కావడంతో ఈ శిక్ష విధించారు. ఈ కేసులో పోలీసువారి తరపున ఏపీపీ ఎస్‌.శకుంతల వాదనలు వినిపించగా, అప్ప టి ఎస్‌ఐ ఎన్‌.పద్మావతి కేసును దర్యాప్తు చేశారు. కోర్టు కానిస్టేబుల్‌ జి.సూరపునాయుడు, సీఎంఎస్‌ మహిళా కానిస్టేబుల్‌ సీహెచ్‌ సౌజన్య సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపర్చారు.

Updated Date - Jul 18 , 2025 | 12:09 AM