ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు

ABN, Publish Date - May 21 , 2025 | 12:18 AM

నగరంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2023లో నమోదైన పోక్సో కేసులో మంగళవారం శ్రీకాకుళం జిల్లా గార మండలం దీపావళి గ్రామానికి చెందిన ఉప్పెనవలస ఉమామహేశ్వరరావుకు 20 ఏళ్లు కఠిన కారాగారశిక్షతో పాటు రూ.2500 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి తీర్పు వెల్లడించారని విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఓ ప్రకనటలో తెలి పారు.

విజయనగరం క్రైం, మే 20 (ఆంధ్రజ్యోతి): నగరంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2023లో నమోదైన పోక్సో కేసులో మంగళవారం శ్రీకాకుళం జిల్లా గార మండలం దీపావళి గ్రామానికి చెందిన ఉప్పెనవలస ఉమామహేశ్వరరావుకు 20 ఏళ్లు కఠిన కారాగారశిక్షతో పాటు రూ.2500 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి తీర్పు వెల్లడించారని విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఓ ప్రకనటలో తెలి పారు. నగరంలో నివాసం ఉంటున్న 14 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువు తున్న సమయంలో ఉప్పెనవలస ఉమామహేశ్వరరావుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఉమామహేశ్వరరావు ఫోన్‌లో మాట్లాడేవాడు. ప్రేమిస్తున్నానని బాలికను శ్రీకాకుళం తీసుకువెళ్లి అత్యా చారానికి పాల్పడ్డాడు. సదరు బాలిక టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి సీఐ లక్ష్మణరావు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ బి.నాగేశ్వరరావు దర్యాప్తు చేసి నిందితుడిని అరె స్టు చేసి కోర్టులో అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. ఉమామహేశ్వరరావు నేరం రుజువు కావడంతో న్యాయాధికారి తీర్పు ఖరారు చేశారని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - May 21 , 2025 | 12:18 AM