ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాత్‌రూంకు వెళ్లొస్తానని.. బైక్‌తో వ్యక్తి పరారీ

ABN, Publish Date - Apr 23 , 2025 | 12:13 AM

బాత్‌రూంకు వెళ్లొస్తానని చెప్పి బైక్‌ తీసుకెళ్లిన వ్యక్తి దాంతో పరారీ అయిన ఘటన సోమవారం కొత్తవలసలో చో టు చేసుకుంది.

కొత్తవలస, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): బాత్‌రూంకు వెళ్లొస్తానని చెప్పి బైక్‌ తీసుకెళ్లిన వ్యక్తి దాంతో పరారీ అయిన ఘటన సోమవారం కొత్తవలసలో చో టు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస-కె.కోటపాడు రోడ్డులోని జడ్పీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో శ్రీనివాసరావు ఫుడ్‌కోర్టును నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద జార్ఖండ్‌ రాష్ట్రం ధన్‌బాద్‌కు చెందిన జిలానీ పనికి కుదిరాడు. మంగళవారం ఫుడ్‌ కోర్టులో పనిచేస్తున్న జిలానీ పక్క షాపునకు చెందిన వ్యాపారిని బాత్‌రూంకు వెళ్లి వస్తానని బైక్‌ను అడి గాడు. పక్క దుకాణంలోనే జిలానీ పనిచేస్తుండటంతో బైక్‌ను అతడు ఇచ్చా డు. అదే అదనుగా భావించిన జిలానీ.. శ్రీనివాసరావుకు చెందిన ఫుడ్‌ కోర్టు క్యాష్‌ కౌంటర్‌లోని రూ.7 వేలు, బైక్‌తో అక్కడి నుంచి పరారీ అయ్యాడు. బాత్‌రూంకు వెళ్లి వస్తానని చెప్పిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ షన్ముఖరావు షాపింగ్‌ కాంప్లెక్స్‌కు చేరు కుని విచారణ చేపట్టారు. జిలానీ ఆధార్‌ కార్డు కోసం అడిగారు. లేదని చెప్ప డంతో అలాంటి వ్యక్తులను ఎలా పనిలో పెట్టుకుంటారని మందలించారు. పరారైన వ్యక్తి సెల్‌ఫోన్‌ నెంబరు ఆధారంగా జిలానీని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:13 AM