బావిలో పడి వ్యక్తి మృతి
ABN, Publish Date - Jul 18 , 2025 | 11:59 PM
పట్టణంలోని హరిజన వీధికి చెందిన రేజేటి సోమయ్య(54) నేలబావిలో పడి మృతి చెందినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు.
రాజాం రూరల్, జులై 18 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని హరిజన వీధికి చెందిన రేజేటి సోమయ్య(54) నేలబావిలో పడి మృతి చెందినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం అందజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 17న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సోమయ్య శుక్రవారం వరకూ రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. దీంతో హరిజనవీధి సమీపంలోని నేలబావిలో సోమయ్య మృతదేహం తేలిఉండడాన్ని శుక్రవారం గుర్తించారు. ఈ మేరకు మృతుడి భార్య సరోజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ అశోక్‌కుమార్ కేసు నమోదు చేశారు.
Updated Date - Jul 19 , 2025 | 09:55 AM