ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

ABN, Publish Date - May 16 , 2025 | 12:29 AM

మండలంలోని చినచామలాపల్లి గ్రా మానికి చెందిన చిడగ బాలకృష్ణ (44) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసు కున్న ఘటన గురువారం చోటుచేసుకుంది.

దత్తిరాజేరు, మే 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చినచామలాపల్లి గ్రా మానికి చెందిన చిడగ బాలకృష్ణ (44) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసు కున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. పెదమానాపురం ఎస్‌ఐ ఆర్‌. జయంతి తెలిపిన వివరాల మేరకు.. చిడగ బాలకృష్ణ తరచూ మద్యం సేవిస్తుంటాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించినప్పటికీ మద్యాన్ని మానకుండా తరచూ భార్యతో గొడవపడేవాడు. మందలిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఎప్పటికప్పుడు బెదిరించేవాడు. బుధవారం కూడా ఎప్పటి లాగే మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య మందలించింది. దాంతో మనస్తాపానికి గురయ్యాడు. గొర్రెలు మేపేందుకు వెళ్లి అక్కడే గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరిన బాలకృష్ణను 108లో బుధవారం రాత్రి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమిం చడంతో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి చికిత్స పొందుతూ గురు వారం మృతి చెందాడని ఎస్‌ఐ తెలిపారు. మృతుడి తండ్రి చిడగ అచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మృతుడికి భార్య రాధ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Updated Date - May 16 , 2025 | 12:30 AM