ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వంద పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురండి

ABN, Publish Date - Jun 14 , 2025 | 12:16 AM

సాలూరు పట్టణం లో వంద పడకల ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేం దుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక ప్రతినిధి బృందం డిమాండ్‌ చేసింది.

ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడుతున్న బృంద సభ్యులు
  • ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక డిమాండ్‌

సాలూరు, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): సాలూరు పట్టణం లో వంద పడకల ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేం దుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక ప్రతినిధి బృందం డిమాండ్‌ చేసింది. శనివారం ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ ఎ.అజయ్‌ శర్మ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షు రాలు కె.విజయగౌరి, నాయకుడు కె.వెంకటరావు, ఎస్‌ఎఫ్‌ ఐ ఉపాధ్యక్షుడు రవికుమార్‌ బృందం నిర్మాణంలో ఉన్న వందపడకల ఆసుపత్రిని, ప్రస్తుతం ఆసుపత్రిల్లో అందు తున్న వైద్యాన్ని పరిశీలించారు. నర్సింగ్‌ విద్యార్థులు చేస్తు న్న రెగ్యులర్‌ చెకప్‌లు, టెస్టులు, పేషెంట్లతో కూడిన వార్డులు, స్కానర్‌ మిషన్లు, గదులను పరిశీలించారు. కాం ట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆర్‌ఎంవో ద్వారా హాస్టల్‌ సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. వంద పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తే రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సంఘాల నాయకులు శ్రీనివాసరావు, ఈశ్వరరావు, ఎన్‌వై.నాయుడు పాల్గొన్నారు.

వైద్యాధికారులను నియమించాలి

కురుపాం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): ఆసుపత్రులలో వైద్యాధికారులను, వైద్య సిబ్బందిని నియమించి, మౌలిక వసతులు కల్పించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ అజయ్‌శర్మ కోరారు. కురుపాం సీహెచ్‌సీని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక బృందం శుక్రవారం సందర్శించింది. ఈసందర్భంగా ఆసుపత్రి వార్డులో రోగులను పరామర్శించి, వైద్య సేవలు, మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ల్యాబ్‌, ఎక్స్‌రే, మరుగుదొడ్లు పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.శోభారాణితో మాట్లాడి వైద్య సిబ్బంది, మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ 50 పడకల ఆసుపత్రి భవనం నిర్మాణం పూర్తయ్యేలా ప్రభుత్వ చర్యలు చేపట్టాలని కోరారు. వైద్యులు, వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఉపాధ్యక్షురాలు కె.విజయగౌరి, ఆర్గనైజర్‌ సెక్రటరీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:16 AM