పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి
ABN, Publish Date - Jun 07 , 2025 | 12:12 AM
ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటుగా చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. జిల్లాలోని శాఖా గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలు శుక్రవారం ముగిశాయి. ఈసం దర్భంగా పలుపోటీల్లో విజేతలకు బహమతులు ప్రదానంచేశారు. ప్రభుత్వ పాఠశాల లకు వేస సెలవులు ప్రకటించడంతో విద్యార్థుల్లో విజ్ఞానశక్తి పెంచేందుకు శాఖా గ్రంథా లయాల్లో ఏప్రిల్ 28 నుంచి శుక్రవారం వరకూ శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర పౌర గ్రంథాలయ సంచాలకులు కృష్ణమోహన్ ఆదేశాలు జారీచేసిన విషయం విదితమే.

పాలకొండ, జూన్ 6 (ఆంధ్రజ్యోతి):గ్రంథాలయం పరిసరాలను పరిశుభ్రంగా మారు స్తానని నగర పంచాయతీ కమిషనర్ రత్నంరాజు తెలిపారు. స్థానిక గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు జనార్దనరావు మాట్లాడుతూ గ్రంథాలయాలను ఉపయోగిం చుకుంటే ఆలోచనాపరులుగా ఎదుగుతారన్నారు. గ్రంథాలయాధికారి బబ్బురు గణేష్ బాబు వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు, చిన్నారులకు బహుమతులను అం దించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు గొర్లె మురళీ, గ్రంథాలయ సహాయకుడు ఈశ్వర్ పాల్గొన్నారు.
ఫబలిజిపేట, జూన్ 6(ఆంధ్రజ్యోతి):బలిజిపేట శాఖా గ్రంథాలయంలో శుక్రవారం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. శాఖా గ్రంథాల యంలో వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల ఆటల, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు హైస్కూల్ హెచ్‌ఎం రత్నాకర్, పంచాయతీ కార్యదర్శి ఆదిలక్ష్మి బహుమతులను అందజేశారు. ఈ కార్య క్రమంలో లైబ్రేరియన్ రాజగోపాల్ పాల్గొన్నారు.
ఫగరుగుబిల్లి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి):స్థానిక శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా గరుగుబిల్లిలో నిర్వాహకులు నల్ల మధుసూదనరావు పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందించారు.
Updated Date - Jun 07 , 2025 | 12:12 AM