ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Price Decline మొక్కజొన్న ధర పతనం

ABN, Publish Date - May 06 , 2025 | 11:06 PM

Maize Price Decline మొక్కజొన్న పంట ధర తగ్గింది. క్వింటాకు రూ.250 వరకు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందు తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక పోవడంతో ఆందోళన చెందుతున్నారు.

మామిడిపల్లి వద్ద రోడ్డుపై మొక్కజొన్నను ఎండబెట్టిన దృశ్యం

ఆవేదనలో రైతులు

సాలూరు రూరల్‌, మే 6(ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న పంట ధర తగ్గింది. క్వింటాకు రూ.250 వరకు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందు తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో పంటను దాచుకోలేక, అమ్ముకోలేక సతమతమవుతున్నారు. జిల్లాలోని 15 మండ లాల్లో మొత్తం 21,572 ఎకరాల్లో పంట సాగైంది. అందులో 4 వేల ఎకరాలు విత్తన మొక్కజొన్న, 8,572 ఎకరాల్లో సాధారణ మొక్కజొన్నను సాగు చేశారు. దాదాపు 30 వేల టన్నుల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం క్వింటా మొక్క జొన్న ధర రూ.2,225గా నిర్ణయించింది. అయితే ప్రైవేట్‌ వర్తకులు అంత కంటే అధిక ధరకే కొనుగోలు చేసేవారు. కొద్దిరోజుల కిందట వరకు క్వింటాకు రూ.2,600 వరకు ఇచ్చేవారు. అయితే ఇటీవల గుంటూరు ప్రాంతంలో మొక్కజొన్న దిగుబడి అధికంగా రావడంతో ధర తగ్గించారు. బర్డ్‌ఫ్లూ వల్ల పౌలీ్ట్ర పరిశ్రమ దెబ్బతినడం, ఇతర ప్రాంతాల్లో దిగుబడి వల్ల ప్రస్తుతం సాలూరు ప్రాంతంలో వ్యాపారులు క్వింటా మొక్కజొన్నను రూ. 2,300 నుంచి రూ.2,350 కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే మిల్లులకు పంపిన పంటకు సంబంధించి వర్తకులు పేమెంట్లు జాప్యం చేస్తుండడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.

Updated Date - May 06 , 2025 | 11:06 PM