Login to your land portal మీ భూమి పోర్టల్‌కు లాగిన్
ABN, Publish Date - Jul 25 , 2025 | 12:18 AM
Login to your land portal భూములకు సంబంధించి 1బీ తీయాలన్నా.. అడంగల్ కావాలన్నా.. ఎఫ్‌ఎంబీ అవసరం పడినా.. ఆన్‌లైన్ సెంటర్‌కు వెళ్లి నిమిషాల్లో పొందేవారు. ఇప్పుడు అంత ఈజీ కాదు. మీభూమి పోర్టల్ ఓపెన్ చేయాలంటే ముందుగా ఫోన్ నెంబరు నమోదు చేయాలి. తరువాత క్యాప్‌చ వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాతే వెబ్‌ల్యాండ్ తెరుచుకుంటుంది. నెట్ వేగం లేకపోయినా పని జరగదు. గ్రామాల్లో ఈ ప్రక్రియంతా జరగడానికి చాలా సమయం తీసుకుంటోంది
మీ భూమి పోర్టల్‌కు
లాగిన్
భూముల సమాచారం తెలుసుకునేందుకు రైతుల అవస్థలు
వెబ్‌ల్యాండ్ సకాలంలో తెరుచుకోని భూముల వివరాలు
నెట్ సెంటర్ల వద్ద గంటల కొద్దీ నిరీక్షణ
విజయనగరం కలెక్టరేట్, జూలై 24(ఆంధ్రజ్యోతి): భూములకు సంబంధించి 1బీ తీయాలన్నా.. అడంగల్ కావాలన్నా.. ఎఫ్‌ఎంబీ అవసరం పడినా.. ఆన్‌లైన్ సెంటర్‌కు వెళ్లి నిమిషాల్లో పొందేవారు. ఇప్పుడు అంత ఈజీ కాదు. మీభూమి పోర్టల్ ఓపెన్ చేయాలంటే ముందుగా ఫోన్ నెంబరు నమోదు చేయాలి. తరువాత క్యాప్‌చ వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాతే వెబ్‌ల్యాండ్ తెరుచుకుంటుంది. నెట్ వేగం లేకపోయినా పని జరగదు. గ్రామాల్లో ఈ ప్రక్రియంతా జరగడానికి చాలా సమయం తీసుకుంటోంది. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. మీభూమి పోర్టల్‌కు లాగిన్ ఆప్షన్ పెట్టడంతోనే ఈ కష్టాలు మొదలయ్యాయి.
రైతులు తమ భూమి వివరాలను ఇదివరకు ఆన్‌లైన్‌లో మీ భూమి పోర్టల్ ద్వారా ఇంటి వద్దే తెలుసుకునేవారు. ఫోన్‌లో కాని కంప్యూటర్ ద్వారా కాని క్షణంలో తెలుసుకునేవారు. పబ్లిక్ డొమైన్‌లో ఇప్పటివరకూ సులువుగా పని జరిగేది. రైతులు అవసరం వచ్చినప్పుడల్లా భూములకు సంబంధించిన 1బి, అడంగల్, ఎఫ్‌ఎంబీ తీసుకునేవారు. ఆధార్‌కు 1బి లింకు అయ్యిందా? గ్రామ ఎఫ్‌ఎంబీ, గ్రామ 1బి తదితర సమాచారం కూడా పొందేవారు. పోర్ట్‌ల్‌లో భూముల వివరాలు అందుబాటులో ఉండటంతో వారికి కావాల్సిన సయమంలో డౌన్‌లోడ్ చేసుకునేవారు. బ్యాంకు రుణాలు పొందడానికి, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో వాటిని అందజేసేవారు. రెండు రోజుల నుంచి ఈ విధంగా కావడం లేదు. మీభూమి పోర్టల్‌కు లాగిన్ ఆప్షన్ పెట్టడంతో రైతులకు అవస్థలు మొదలయ్యాయి. ఫోన్ నెంబరు ఎంటర్ చేసిన తరువాత క్యాప్‌చ వస్తుంది. ఆపై ఫోన్ నెంబరుకు ఆరు డిజిటల్ నెంబరు గల ఓటీపీ రావాలి. చాలా సార్లు ప్రయత్నం చేసిన తరువాతే ఓటీపీ వస్తోంది. దీంతో ఓటీపీ నమోదు చేసినా పోర్టల్ తెరుచుకోవడం లేదు. తిరిగి రెండోసారి ఫోన్ నెంబరు ఎంటర్ చేస్తే మరో 20 నిమిషాల పాటు వెయిట్ చేయాలంటూ స్ర్కీన్‌పై డిప్‌ప్లే అవుతోంది. 20 నిమిషాల తరువాత ప్రయత్నం చేస్తే ఫోన్ నెంబరుకు ప్రసుత్తం లిమిట్ అయిపోయిందని సమాచారం వస్తోంది. దీంతో రైతులు నెట్ సెంటర్ల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీ భూమి పోర్టల్‌ను పాత పద్ధతిలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
Updated Date - Jul 25 , 2025 | 12:18 AM