ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జీవనోపాధికి లింకేజీ రుణాలు

ABN, Publish Date - May 14 , 2025 | 12:26 AM

పొదుపు సంఘాల్లోని సభ్యులకు జీవనోపాధిని కల్పిం చేందుకు బ్యాంకర్ల సహకారంతో లింకేజీ రుణాలు అందిస్తున్నామని మెప్మా పీడీ గంటి వెంకట చిట్టిరాజు తెలిపారు. ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు.

మాట్లాడుతున్న చిట్టిరాజు:

బొబ్బిలి రూరల్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): పొదుపు సంఘాల్లోని సభ్యులకు జీవనోపాధిని కల్పిం చేందుకు బ్యాంకర్ల సహకారంతో లింకేజీ రుణాలు అందిస్తున్నామని మెప్మా పీడీ గంటి వెంకట చిట్టిరాజు తెలిపారు. ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు. మంగళవారం బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మెప్మా పరిధిలో 2,602 సంఘాలు ఉన్నాయని తెలిపారు. వాటికి 275 కోట్ల రూపాయలను రుణాలుగా అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించామని, ఇప్పటికే 244 సంఘాల సభ్యులకు దాదాపు 25 కోట్లు రుణాలుగా అం దించామన్నారు. ప్రతి సభ్యునికి రెండు లక్షల వరకు వ్యక్తిగత రుణాలందిస్తున్నామని తెలిపారు. చిన్నతరహా వాణిజ్య వ్యాపారాలకు అవసరమైన మొత్తాలను పూర్తి స్థాయిలో అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సంఘంలోని ప్రతి సభ్యురాలి వివరాలు ఆన్‌లైన్‌ చేశామని, ప్రత్యే కంగా ఎస్‌హెచ్‌జీ సాఫ్ట్‌వేర్‌ రూపొందించామని తెలిపారు.ఈ విధానం వల్ల నిధు లు దుర్వినియోగం, ఫేక్‌ అకౌంట్లు, లోన్లు మంజూరు కావన్నారు. కొత్తగా 160 సంఘాలను తయారు చేయగా 304 పాత సంఘాలకు అప్‌గ్రేడ్‌ చేశామని తెలిపా రు. రిక్షా, ఆటో, తోపుడు బళ్లు, ఇతర రంగాల్లో ఉన్న కార్మికులు, ప్రత్యేక అవసరాలు గల వారితో ఐదుగురు చొప్పున సంఘాలను ఏర్పాటు చేస్తూ వారి జీవనోపాధికి అవసరమై రుణాలు అందించేందుకు బ్యాంకర్లతో సమావేశాలు జరుపుతున్నామని తెలిపారు.సమావేశంలో ఎంపీడీవో రవికుమార్‌, పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 12:26 AM