Mahanadu! చలో ‘మహానాడు’
ABN, Publish Date - May 25 , 2025 | 11:22 PM
Let's Go to Mahanadu! ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత టీడీపీ తొలిసారిగా కడపలో నిర్వహించనున్న మహానాడుకు బయల్దేరేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న పసుపు పండగకు హాజరయ్యేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
పసుపు పండగకు భారీగా వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు సన్నద్ధం
ఏర్పాట్లలో జిల్లా నేతలు
పార్వతీపురం, మే 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత టీడీపీ తొలిసారిగా కడపలో నిర్వహించనున్న మహానాడుకు బయల్దేరేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న పసుపు పండగకు హాజరయ్యేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా నుంచి ప్రత్యేక బస్సుల్లో వెళ్లేందుకు సన్నద్ధ మవుతున్నారు. టీడీపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే మహానాడును ఈ సారి వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా భావించే కడపలో మొదటి సారిగా నిర్వహించడం ఓ ప్రత్యేకత. దీంతో శ్రేణులంతా జోష్‌లో ఉన్నారు. ఈసారి ఎలాగైనా మహానాడుకు వెళ్లాలని ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి గ్రామం, పట్టణం నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లాలని భావిస్తున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల నుంచి ప్రత్యేక బస్సుల్లో కడపకు ప్రయాణం కానున్నారు. మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో మహా నాడుకు చేరుకోనున్నారు. మరోవైపు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇప్పటికే మహానాడు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు కమిటీలో సభ్యు రాలిగా ఉన్న ఆమె వేడుక ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మహానాడుకు హాజరయ్యే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు. ‘జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు మహానాడుకు తరలిరానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో కార్యక్ర మాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నాం.’ అని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, పాల కొండ నుంచి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
భారీగా తరలిరావాలి..
పార్వతీపురం రూరల్: కడపలో నిర్వహించనున్న మహానాడుకు భారీగా తరలిరావాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులతో సమావేశ మయ్యారు. 27, 28 తేదీల్లో పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వం పనితీరు తదితర అంశాలపై చర్చ జరుగుతుందని, 29న సుమారు ఐదు లక్షల మంది శ్రేణులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని వెల్లడించారు. నియోజకవర్గానికి సంబంధించి కీలక అంశాలను మహానాడులో ప్రస్తా వించే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా అందరూ పాల్గొనాలని కోరారు. మహానాడుకు వెళ్లేందుకు నియోజకవర్గం నుంచి ప్రత్యేక బస్సు లను ఏర్పాటు చేశామని తెలిపారు.
- గుమ్మలక్ష్మీపురం: కడపలో నిర్వహిం చనున్న మహానాడుకు భారీగా శ్రేణులు తరలిరావాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
Updated Date - May 25 , 2025 | 11:22 PM