ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఖేదం.. మోదం

ABN, Publish Date - Jun 08 , 2025 | 11:58 PM

మరో నాలుగు రోజుల్లో బడులన్నీ తెరుచుకోనున్నాయి. ఏ ఇద్దరు ఉపాధ్యాయులు కలిసి మాట్లాడుకున్నా ఒక్కటే మాట.

- ఇదీ బదిలీల్లో ఉపాధ్యాయుల పరిస్థితి

- కోరుకున్న పాఠశాలలు వచ్చినవారిలో అమితానందం

- రానివారిలో నైరాశ్యం

బొబ్బిలి, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): మరో నాలుగు రోజుల్లో బడులన్నీ తెరుచుకోనున్నాయి. ఏ ఇద్దరు ఉపాధ్యాయులు కలిసి మాట్లాడుకున్నా ఒక్కటే మాట. ‘పలానా స్కూలు మంచిదేనా? ఎంత దూరం ఉంటుంది? విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు మంచి వారేనా? హైస్కూల్‌లో పనిచేసిన స్థాయి నుంచి ఎస్‌జీటీగా వచ్చేస్తున్నాను. ఈ కొత్త స్కూలులో విద్యార్థుల సంఖ్యను కాపాడుకోకపోతే అక్కడ నుంచి మరో బడికి పంపించేస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఎలా ఆకట్టుకోవాలి? విద్యార్థుల సంఖ్యను ఎలా పెంచాలి. భవిష్యత్‌లో పాఠశాల మనుగడ, ఉద్యోగ స్థానంపై ఆందోళనగా ఉంది.’ అంటూ ఉపాధ్యాయులు వారిలో వారు అనేక రకాలైన ఆసక్తిదాయకమైన చర్చలు జరుపుకొంటున్నారు.

-ఈ నెల 12న పాఠశాలలు తెరిచేలోగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తుండడంతో నిబంధనల ప్రకారం గడువుమీరిన ఉపాధ్యాయులంతా కొత్తబడుల్లోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉపాధ్యాయులకు బదిలీ కౌన్సిలింగ్‌ను నిర్వహించి వారు ఎంచుకున్న పాఠశాలలకు కేటాయింపులు జరుపుతున్నారు. ఈ తతాంగమంతా కొందరి ఉపాధ్యాయులకు ఖేదాన్ని, మరికొంతమంది ఉపాధ్యాయులకు మోదాన్ని మిగుల్చుతోంది. రవాణాకు అనువుగా ఉంటూ నివాసప్రాంతాలకు చేరువగా ఉండే పాఠశాలలకు బదిలీ అయిన వారంతా అమితానందం పొందుతున్నారు. అందుకు భిన్నంగా దూర ప్రాంతాలకు, రవాణా సదుపాయం లేని గ్రామాలకు బదిలీఅయిన వారంతా మదనపడుతున్నారు.

- రేషనలైజేషన్‌లో భాగంగా పోస్టులు కోల్పోయిన వారు గతంలో పనిచేసిన సర్వీసుకు సంబంధించి పాయింట్లు అదనంగా దక్కించుకుంటున్నారు. ఇలా పాయింట్ల విషయంలో వెనుకబడిన వారంతా తమకు దక్కాల్సిన పాఠశాలల స్థానాన్ని మరొకరు తన్నుకుపోతున్నారన్న ఆవేదనతో కుంగిపోతున్నారు.

- ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం పోస్టులను ఎస్‌జీటీలకు కాకుండా స్కూలు అసిస్టెంట్లకు కేటాయిస్తుండడంతో సంబంధిత ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఇన్నాళ్లూ స్కూల్‌ అసిస్టెంట్ల హోదాలో హైస్కూళ్లలో విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు, ఇప్పుడు రేషనలైజేషన్‌ ప్రభావంగా ప్రాథమిక పాఠశాలల్లో బోధన చేయాల్సి రావడం ప్రాణ సంకటంగా తయారైంది. మాన్యువల్‌ కౌన్సిలింగ్‌ విధానంతో ఎస్‌జీటీలలకు మోదంగా మారింది. అర్ధరాత్రి వరకు కౌన్సిలింగ్‌ నిర్వహించాల్సి రావడంతో అధికారులకు ఇబ్బందికరంగా మారింది.

-యూపీ స్కూళ్లలో 30 లోపు విద్యార్థులు ఉంటే రెండు, 30 దాటితే 4 చొప్పున స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఇవ్వడంతో అలాంటి పోస్టుల స్థానాలను కోరుకునే వారు అభద్రతా భావానికి గురవుతున్నారు. రేషనలైజేషన్‌, వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ విధానాల ప్రభావంతో ఆ పోస్టుకు ఎప్పుడు ఎసరు వస్తుందోనన్న ఆందోళన ఉపాధ్యాయ వర్గాల్లో నెలకొంది.

- మోడల్‌ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసిన ప్రతీ తరగతికి ఒక టీచరు ఉండే వ్యవస్థ రూపుదాల్చుతోంది. అక్కడ పనిచేసే అవకాశం దక్కించుకున్న వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. అదే సమయంలో మండల పరిధిలో సుమారు సగం పాఠశాలల్లో విద్యార్థుల కొరత కారణంగా సింగిల్‌ టీచరు వ్యవస్థతో నెట్టుకురావాల్సి వస్తోంది. అలాంటి చోట పనిచేయాల్సిన దుస్థితి రావడాన్ని ఉపాధ్యాయులు ఓ శాపంగా భావిస్తున్నారు. ఒకే వ్యక్తి ఐదు తరగతులను బోధించడం కష్టసాధ్యం. పైగా అత్యవసర సమయాల్లో సెలవు పెట్టాలన్నా నానా తిప్పలు పడాల్సివస్తుంది. అదే విధంగా హైస్కూళ్లలో గతంలో 1ః40గా ఉండే ఉపాధ్యాయ-విద్యార్థుల నిష్పత్తిని 1ః49 గా మార్చడంతో గందరగోళంగా తయారైంది.

అంతా గందరగోళమే

ఉపాధ్యాయుల బదిలీ కోసం ఎవరూ కోరకపోయినా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టంతో కొత్తగా ఎవరికీ ఒరిగిందేమీ లేదు. అంతా గందరగోళంగా తయారైంది. బదిలీలు, రేషనలైజేషన్‌ ప్రక్రియ ఉపాధ్యాయుల పాలిట పెద్ద సమస్యగా తయారైంది. బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లు లేకుండా చేయడం అన్యాయం. దీని కారణంగా ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య తగ్గింది. హైస్కూళ్లలో రెండు మీడియంలను రద్దు చేయడంతో సుమారు 9 వేలకు పైగా పోస్టులు మిగులుగా చూపిస్తున్నారు. వీరందరినీ ఎన్‌టైటిల్‌మెంట్‌ పాయింట్ల ద్వారా ప్రాథమిక పాఠశాలలకు సర్దుబాటు చేశారు. స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రీవియస్‌ సర్వీస్‌ పాయింట్లు ఇవ్వకపోవడం వారికి నష్టదాయకమే.

- కె.విజయగౌరి, యూటీఎఫ్‌ నేత, బొబ్బిలి

ఎస్‌జీటీలకు అన్యాయం

ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం పోస్టులను ఎస్‌టీలకు పదోన్నతి కల్పించి భర్తీ చేయడమే న్యాయం. అలాకాకుండా స్కూల్‌ అసిస్టెంట్లకు కట్టబెట్టడం వల్ల ఎస్‌జీటీలకు అన్యాయం జరుగుతుంది. విద్యాహక్కు చట్టం అమలు ప్రశ్నార్థకంగా తయారైంది. తొమ్మిది రకాల పాఠశాలలను తీసుకొస్తున్నా స్పందన కరువైంది. రెండు మీడియంలను అమలు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. మాతృభాష తెలుగును దూరం చేస్తున్నారు. ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ ఉపాధ్యాయుల సమస్యను అందరికీ సానుకూలంగా పరిష్కరించడం లేదు.

-జేసీ రాజు, గంట సత్యనారాయణ, ఉపాధ్యాయ సంఘ నేతలు

Updated Date - Jun 08 , 2025 | 11:58 PM