KGBV Special Officer Suspended కేజీబీవీ ప్రత్యేక అధికారి సస్పెన్షన్
ABN, Publish Date - Jul 15 , 2025 | 11:21 PM
KGBV Special Officer Suspended సాలూరు మండలం కరాసవలస కేజీబీవీ ప్రత్యేక అధికారి జి.ప్రశాంతితో పాటు నలుగురు కుక్‌లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశాల మేరకు ఏపీసీ అసిస్టెంట్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ తేజేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు
పార్వతీపురం, జూలై 15(ఆంధ్రజ్యోతి): సాలూరు మండలం కరాసవలస కేజీబీవీ ప్రత్యేక అధికారి జి.ప్రశాంతితో పాటు నలుగురు కుక్‌లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశాల మేరకు ఏపీసీ అసిస్టెంట్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ తేజేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు రెండు నెలల కిందట మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకస్మికంగా కేజీబీవీని సందర్శించారు. ఆ సమయంలో విద్యార్థినులు పలు సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు. సరిపడా ఆహారం ఉండడం లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాలతో సంబంధిత అధికారులు విచారణ జరిపారు. విద్యార్థినులకు సరిపడా ఆహారం లేకపోవడం వాస్తవమేనని తేల్చారు. మరికొన్ని సమస్యలతో విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు సదరు కేజీబీవీ ప్రత్యేకాధికారితో పాటు నలుగురు కుక్‌లను సస్పెండ్ చేశారు.
Updated Date - Jul 15 , 2025 | 11:21 PM