కేసీసీ రుణాలపై స్పందించాలి
ABN, Publish Date - May 23 , 2025 | 12:09 AM
జిల్లాలో కిసాన్ క్రెడిట్ కార్డులు(జీసీసీ) రుణాలపై బ్యాంకర్లు తక్షణమే స్పందించకపోతే ఉపేక్షించబోమని కలెక్టర్ శ్యాం ప్రసాద్ స్పష్టంచేశారు. కేసీసీలో వచ్చిన దరఖాస్తులపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పార్వతీపురం, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కిసాన్ క్రెడిట్ కార్డులు(జీసీసీ) రుణాలపై బ్యాంకర్లు తక్షణమే స్పందించకపోతే ఉపేక్షించబోమని కలెక్టర్ శ్యాం ప్రసాద్ స్పష్టంచేశారు. కేసీసీలో వచ్చిన దరఖాస్తులపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంకర్లకు నిర్దేశించిన లక్ష్యాలు సకాలంలో సాధించాలని, అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. గురువారం పార్వ తీపురం కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకు అధికారులు, పలు శాఖల అధికారులతో డీసీసీ అండ్ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ 2024 సంవత్సరానికి తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు ఈ ఏడాది రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ పథకం కింద యువత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ఊతమివ్వాలన్నారు. ప్రధా నమంత్రి స్వానిధి, మత్స్యకారుల వీధి వ్యాపారాలకు రుణాలు, ము ద్రా రుణాలు మంజూరులో కొన్ని బ్యాంకులు వెనుకబడి ఉండడంతో త్వరితగతిన లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జూన్ 21 వరకు యోగాంధ్ర కార్య క్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ శోబిక, ఐటీడీఏ ప్రా జెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి హేమలత పాల్గొన్నారు.
సీతంపేటలో పీజీఆర్‌ఎస్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం సీతంపేటలో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు నుంచి సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
నాణ్యమైన జీడిపిక్కలను కొనుగోలు చేయాలి
నాణ్యమైన జీడిపిక్కలను కొనుగోలు చేయాలని, బ్రాండింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ కోరారు.పార్వతీపురంలోని మార్కెట్ యార్డులో జీడి ప్రాసెసింగ్ యూనిట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట డీఆర్వో కె.హేమలత, గిరిజన సంక్షేమశాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ మణిరాజ్, ఏపీవో మురళీధర్, ఉన్నారు.
ఈవీఎం గోదామును తనిఖీ
పార్వతీపురం వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఈవీఎం గోదామును కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ తనిఖీ చేశారు.గోదాములకు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాటును పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో కలెక్టర్ సంతకంచేశారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, తహశీల్దార్ వై.జయలక్ష్మి పాల్గొన్నారు.
Updated Date - May 23 , 2025 | 12:09 AM