ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘సుపరిపాలన’లో సమస్యపై స్పందించిన కర్రోతు

ABN, Publish Date - Jul 10 , 2025 | 12:16 AM

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజుతో పాటు నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను తెలియ జేశారు.

తాగునీటి సరఫరాను పరిశీలిస్తున్న మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు

పూసపాటిరేగ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజుతో పాటు నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను తెలియ జేశారు. ఈ తరుణంలో స్థానిక యాతపేటకు చెందిన ప్రజలు తమ ప్రాంతానికి తాగునీరు రావడం లేదని, వీధి దీపాలు వెలగడం లేదని తెలిపారు. దీనితో వెంటనే స్పందిచిన కర్రోతు స్థానిక పంచాయతీ కార్యదర్శికి, ఎంపీడీవోకు, మంచినీటి సరఫరా అధికారికి సమాచారమిచ్చారు. దీంతో అధికారులు అక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. దీనికి గాను పంచాయితీలో తగినంత నిధులు లేవని కార్యదర్శి తెలిపారు. అయితే మరమ్మతుల ఖర్చులు తాను భరిస్తానని మాజీ సర్పంచ్‌ పిన్నింటి సన్యాసినాయుడు అధికారులకు తెలిపారు. వెంటనే మరమ్మతులను ప్రారంభించారు. నాలుగు రోజులలోగా తాగునీటిని అందించాలని బంగార్రాజు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు మహంతి శంకరరావు, తెలుగు యువత అధ్యక్షు డు పిన్నింటి కిషోర్‌, చందక ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:16 AM