Lord Jagannath జగన్నాథునికి జ్యేష్టాభిషేకం
ABN, Publish Date - Jun 12 , 2025 | 12:34 AM
Jyesthabhishekam for Lord Jagannath సాలూరులో జగన్నాథుని ఆలయంలో బుధవారం వైభవంగా జేష్ట్యాభిషేకం నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, సాలూరు జమీందారు విక్రం చంద్రసన్యాసిరాజుతో రుత్వికులు వినయశర్మ, చైతన్య, రాకేష్ తదితరులు శాస్త్రోక్తంగా గణపతిపూజ, పుణ్యాహవచనం, వరుణపూజలు చేయించారు.
సాలూరు రూరల్/పాలకొండ, జూన్ 11 (ఆంధ్రజ్యోతి ): సాలూరులో జగన్నాథుని ఆలయంలో బుధవారం వైభవంగా జేష్ట్యాభిషేకం నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, సాలూరు జమీందారు విక్రం చంద్రసన్యాసిరాజుతో రుత్వికులు వినయశర్మ, చైతన్య, రాకేష్ తదితరులు శాస్త్రోక్తంగా గణపతిపూజ, పుణ్యాహవచనం, వరుణపూజలు చేయించారు. స్వామివారిని ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి అభిషేకాలు చేశారు. అనంతరం మళ్లీ జగన్నాథుని చీకటి గదిలోకి తీసుకెళ్లారు. ఈ నెల 27 నుంచి స్వామివారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. రథయాత్రకు ముందు ఈ ప్రక్రియను చేపట్టడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక డివిజన్ కేంద్రం పాలకొండలోని జగన్నాథస్వామి ఉత్సవాలకు బుధవారం అంకుర్పారణ జరిగింది. స్వామికి ఘనంగా జ్యేష్టాభిషేకం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను గర్భగుడి నుంచి బయటకు తీసుకొచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను చీకటి గదికి తరలించారు. ఈ నెల 26న రథంపై చక్ర ప్రతిష్ఠ కార్య క్రమం నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం నుంచి జగన్నాథస్వామి ప్రత్యేక దర్శనం ఇవ్వనున్నారు. 27 నుంచి రథయాత్ర ప్రారంభం కానుంది.
Updated Date - Jun 12 , 2025 | 12:34 AM