ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తా

ABN, Publish Date - Apr 27 , 2025 | 12:18 AM

పార్టీయే ప్రాణంగా పని చేసిన ప్రతి కార్యకర్తకు తప్పనిసరిగా న్యాయం చేస్తానని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు.

  • మంత్రి సంధ్యారాణి

సాలూరు/మక్కువ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): పార్టీయే ప్రాణంగా పని చేసిన ప్రతి కార్యకర్తకు తప్పనిసరిగా న్యాయం చేస్తానని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. మక్కువ మండల కేంద్రంలో ఓ కల్యాణ మండపంలో శనివారం ఆమె టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తన సొంత మండలమైన మక్కువ నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని అన్నారు. కొంతమంది వెన్నంటే ఉండి వెన్నుపోటు రాజకీయం చేశారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పన్నినా మక్కువ మండల ప్రజలు తనకు మద్దతు తెలిపి ఓటు వేసినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. మజ్జిగౌరమ్మ అలయం నుంచి వంతెన వరకు సుమారు రూ.3 కోట్లతో రోడ్డుతో పాటు ఇరువైపుల కాలువలు నిర్మాణం చేపడతామని చెప్పారు. మరో రెండు రోజుల్లో ప్రధాన రహదారిలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు గుళ్ల వేణుగోపాల్‌నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండలంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. అనంతరం 21 పంచాయతీల నాయకులు, కార్యకర్తలతో ఆమె నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మెంధి సింహాచలం, మల్లేశ్వరరావు, గౌరీశంకరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 12:18 AM