Junior Colleges 2న జూనియర్ కళాశాలల పునఃప్రారంభం
ABN, Publish Date - May 30 , 2025 | 11:27 PM
Junior Colleges to Reopen on 2nd ప్రభుత్వ జూనియర్ కళాశాలలను జూన్ 2న పునః ప్రారంభించ నున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (డీఐఈవో) నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు మరో 74 ప్రైవేట్, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు ఉన్నాయన్నారు.
జియ్యమ్మవలస, మే30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలను జూన్ 2న పునః ప్రారంభించ నున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (డీఐఈవో) నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు మరో 74 ప్రైవేట్, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు ఉన్నాయన్నారు. కళాశాలలు పునఃప్రారంభమైన మరుసటి రోజే మొదటి సంవత్సరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. ఆ రోజు నుంచే కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని వెల్లడించారు. లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు.
విద్యాప్రమాణాల పెంపే లక్ష్యం
పార్వతీపురం టౌన్, మే 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కళాశాలల్లో విద్యాప్రమాణాలతో పాటు ఉతీర్ణత శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని డీఐఈవో నాగేశ్వరరావు ఆదేశించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ని పట్టణంలో శుక్రవారం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపక సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధ్యాపకుడిగానే కాకుండా ప్రిన్సిపాల్‌గా పనిచేసిన అను భవం తనకుందని తెలిపారు. డీఐఈవోగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తా నని అన్నారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అధ్యాపకుల సహాయ సహకారాలతో విద్యార్థులకు ఉత్తమ బోధన అందిస్తామన్నారు.
Updated Date - May 30 , 2025 | 11:27 PM