Road చేయి చేయి కలిపి.. రోడ్డు వేసి..
ABN, Publish Date - Jul 21 , 2025 | 11:39 PM
Joining Hands to Lay the Road సీతంపేట మండలం పుబ్బాడ పంచాయతీ పరిధి గుజ్జి గ్రామానికి చెందిన గిరిజన యువకులు చేయి చేయి కలిపి శ్రమదానంతో సోమవారం మట్టిరోడ్డును నిర్మించుకున్నారు.
సీతంపేట రూరల్, జూలై 21(ఆంధ్రజ్యోతి): సీతంపేట మండలం పుబ్బాడ పంచాయతీ పరిధి గుజ్జి గ్రామానికి చెందిన గిరిజన యువకులు చేయి చేయి కలిపి శ్రమదానంతో సోమవారం మట్టిరోడ్డును నిర్మించుకున్నారు. ఆ గ్రామంలో వీధి కాలువలు లేవు. దీంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుజ్జి గ్రామ మట్టి రహదారి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్థులు శ్రమదానం చేసి రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. ఐటీడీఏ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి.. తమ గ్రామానికి రహదారి, కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.
Updated Date - Jul 21 , 2025 | 11:39 PM